35.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

కోరుట్ల లో వైభవంగా వసంత పంచమి మహోత్సవ మహా లింగార్చన

(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ శివ మార్కండేయ కోటీ నవదుర్గ దేవాలయంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మహాలింగార్చనతో పాటు ఆలయ 22వ వార్షికోత్సవ కార్యక్రమాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
వసంత పంచమి సందర్భంగా ఆలయంలో 108 జంటలతో మహాలింగార్చన, కృత్తిక లింగాభిషేకం, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. శివుడిని ఆరాధించే శక్తివంతమైన, విశిష్టమైన పూజా విధానాల్లో మహాలింగార్చన ఒకటని ఆలయ పూజారులు ప్రదీప్ శర్మ, శ్రీధర్ ఈ సందర్భంగా వివరించారు.
అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల ఉన్నత సంఘం అధ్యక్షులు గుండుక ప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షులు జిల్లా ధనుంజయతో పాటు పట్టణ ప్రముఖులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles