29.2 C
Hyderabad
Wednesday, September 16, 2026
No menu items!

కలెక్టర్ గారు మాకు అన్యాయం జరిగింది: కోరుట్ల 7 వార్డు ప్రజలు

(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)

కోరుట్ల పట్టణంలోని 7వ వార్డులోని అర్బన్ కాలనీకి చెందిన బీసీలు తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ శనివారం జగిత్యాల కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శనివారం ఖరారైన వార్డు రిజర్వేషన్ జాబితాలో 7వ వార్డులో 99 శాతం బీసీ జనాభా, కేవలం 1 శాతం ఎస్టీ జనాభా ఉన్నప్పటికీ, ఒక్క శాతం ఉన్న వర్గానికే రిజర్వేషన్ కేటాయించడం అన్యాయమని వారు పేర్కొన్నారు.
ఈ నిర్ణయం వల్ల బీసీలకు తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ, రిజర్వేషన్‌ను పునఃపరిశీలించాలని కోరుతూ జగిత్యాల కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గుద్దేటి రాజేందర్, బండ్ల రాజేష్, చిలివేరి అర్జున్, సందారికారి రఘు, రాచర్ల రాజేశం, చింత రవితేజా, గాలిపెల్లి వేణు, కాయల్కర్ అంజనికుమార్, గణపురం మణికంఠ, మచ్చ రాకేష్, చిరుమల్ల రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ అంశంపై జిల్లా కలెక్టర్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.


(దేశభక్తి, దైవ భక్తి, సమకాలీన రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికి రిపోర్టర్లుగా స్వాగతం.)
సంప్రదించండి:
“బాలె అజయ్” – 9290277727

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles