26.2 C
Hyderabad
Thursday, September 17, 2026
No menu items!

హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణాంతకం. కోరుట్ల సీఐ సురేష్ బాబు

(బాలె అజయ్ 9290277727, తెలంగాణ సామ్నా)
“దైవ భక్తి, దేశభక్తి సమకాలీన రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికి “తెలంగాణ సామ్నా” వెబ్ లో రిపోర్టర్లుగా స్వాగతం. వివరాలకు బాలే అజయ్ 9290277727″

తెలంగాణ రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం “ఎర్రైవ్ అలైవ్” ను పోలీస్ శాఖ ఘనంగా ప్రారంభించింది.
కోరుట్ల ఐబీ రోడ్‌లోని కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఐ సురేష్ బాబు మాట్లాడుతూ, రోడ్డుప్రమాదాల వల్ల జరుగుతున్న మరణాలను తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగుతుందని వెల్లడించారు.
హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడపడం ప్రాణాంతకమని అన్నారు, మద్యం సేవించి వాహనం నడపడం ల్యాండ్‌మైన్‌పై నడిచినంత ప్రమాదకరం అని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మరణాలకు హెల్మెట్ ధరించకపోవడమే ప్రధాన కారణమని తెలిపారు.
వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించవద్దని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ప్రజల రక్షణే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని, ప్రజలు సురక్షితంగా ఉంటేనే వారిని కాపాడగలమని అన్నారు. వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్‌లు ప్రజల రక్షణ కోసమేనని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై చిరంజీవి, ఎస్సై అలీముద్దీన్, డిప్యూటీ ఎమ్మార్వో, పట్టణ ప్రముఖులు, యువజన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం “ఎర్రైవ్ అలైవ్” అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles