(పిట్ట రాజేష్ 9398508383, తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణంలోని ఆదర్శ్ నగర్ కి చెందిన వంగ రమ్యసుధ (34) సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త వంగ శ్రీధర్ ఆర్థిక పరిస్థితుల ఒడిదుడుకుల వ్యాపార నిర్వహణ కారణంగా ఇంట్లో గొడవ జరిగినట్టు తెలుస్తున్నది. ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో గొడవ ముదిరినట్టు సమాచారం. ఈ క్రమంలో సోమవారం రమ్యసుధ ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. తెలిసిన వివరాల ప్రకారం భర్త శ్రీధర్ కోరుట్లలో శబరి మ్యాచింగ్ సెంటర్ నడిపిస్తున్నాడు. రమ్యాసుధ వరంగల్ లోని గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. సంక్రాంతి సెలవుల నిమిత్తం తన ఇంటికి వచ్చినట్లు తెలుస్తుంది.
శ్రీధర్ నడిపిస్తున్న మ్యాచింగ్ సెంటర్ లో నష్టాలు రావడంతో, అప్పుల బాధ వల్ల ఇద్దరు మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత తన ఇద్దరు కుమారులను బయట ఆడుకొమ్మని పంపి రమ్యసుధా ఆత్మహత్య చేసుకున్నది. రమ్యసుధా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోరుట్ల సివిల్ హాస్పిటల్ కి తరలించారు. సమాచారం అందుకున్న కోరుట్ల పోలీస్ బృందం ఘటన స్థలానికి చేరుకొని, భర్త శ్రీధర్నీ అదుపులో తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు పోలీసుల విచారణ అనంతరం తెలిసే అవకాశం ఉన్నది.
