
(బాలే అజయ్, తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణంలో ఎయిర్టెల్ నెట్ వర్క్ సర్వీసెస్ నిర్వహించే ఉద్యోగస్తులను కొంతమంది కోరుట్ల మొబైల్ అసోసియేషన్ పేరుతో ఎయిర్ టెల్ సంస్థ ఉద్యోగులను స్థానికంగా వ్యాపారం నిర్వహించాలంటే స్థానిక మొబైల్ అసోసియేషన్ వారికి 10 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని, లేకుంటే స్థానికంగా వ్యాపారం చేయకుండా చేస్తామని వారిని తుపాకులు మరియు కత్తులతో వీడియో కాల్ చేసి బెదిరించారు. దీనితో సంస్థ ఉద్యోగులు భయపడి రూ. 30 వేలు సదరు వ్యక్తులకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా పంపించారు. ఈ విషయమై ఎయిర్ టెల్ డివిజనల్ డిస్ట్రిబ్యూటర్ అయిన దండ బోయిన అరుణ్ ,ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1)మార్త శివకుమార్, 2)భోగ శ్రీనివాస్, 3)అడ్డగట్ల సురేష్ అనే ముగ్గురు వ్యక్తుల పైన కేసు నమోదు చేసి దర్యాపు చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఒక ఎయిర్ గన్ రైఫిల్ మరియు ఒక ఎయిర్ గన్ పిస్టల్ మరియు ఒక తల్వార్ మరియు మూడు చిన్న కత్తులని మరియు వాళ్లు వీడియో కాల్ చేయడానికి ఉపయోగించిన సెల్ ఫోన్ లని స్వాధీనపరచుకొని శుక్రవారం వారిని కోర్టులో హాజరుపరిచినట్టు కోరుట్ల సీఐ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ భవిష్యత్తులో ఎవరైనా కోరుట్ల పట్టణంలోని వ్యాపారస్తులను గాని రియాల్టర్లను గాని లేదా రైస్ మిల్లర్స్ యజమానులను గాని బెదిరించడం గాని, డబ్బుల వసూళ్లకు గాని పాల్పడినట్లతే వారిపై కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని రౌడీషీట్లు ఓపెన్ చేసి, పిడి యాక్ట్ కూడా నమోదు చేయబడుతుంది అని సిఐ సురేష్ బాబు తెలిపారు.

