నిన్నటి తరువాయి
ఏ ఒక్క వ్యక్తిమీద గాని, నాకు చెడుభావము గాని శత్రుత్వముగాని లేదు. అంతేగాదు. ఏ వ్యక్తికూడా నా మీద వ్యక్తిగతముగ శత్రువ్వము వహించి యున్నాడని అనుకోను. అకారణముగ ముస్లింలయెడ పక్షపాత వైఖరిని చూపుచున్న ఈ ప్రభుత్వముయొక్క ఈ విధానమునకు మూలకారణము ` అందుకు అనుకూలముగా గాంధీజీ వుండటమే అని కూడా నేను స్పష్టముగా చూడగల్గినాను. ఆ ఒత్తిడి ఇప్పుడు లేదు కాబట్టి లౌకిక విధానము అనే మాటకు సరిన అస్వయముగల లౌకిక రాజ్యమను స్థాపించుటకు మార్గము సుగమమైనది. ప్రధానమంత్రి పండిత నెహ్రుజీ సమయాసమయాలు లేకుండా లౌకిక రాజ్యమను గూర్చి మాట్లాడేటప్పుడు, ఆయన చర్యలు కృత్యములు కొన్ని సమయములలో ఒకదానికొకటి విరుద్దముగ వుంటాయనే విషయము విస్మరిస్తుంటారని చెప్పవలసి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను. ఎందువల్లనంటే, ఒక మతపరమైన రాజ్యముగా, పాకిస్తాన్ను ఏర్పాటుచేయుటలో పండిత నెహ్రు ప్రముఖ పాత్ర వహించినడనే ముఖ్యమైన విషయమును ఇచ్చట గుర్తింపు వలసియున్నది. కానీ ద్వేషముతో కండ్లు మూసుకొనిపోయిన, మత విశ్వాసము పై ఆధారపడిన ఒక రాజ్యము పక్కెలో బల్లెము వలె వున్నంతవరకు భారత సమాఖ్యకు సుఖశాంతులు చేకూరవని ఆయన గ్రహించి యుండవలసినది. నాలో నేను తర్జనభర్జనలు పడిన తర్వాత గాంధీజీ మీద చర్య తీసుకొన వలసినదిగా నా మనస్సు నన్ను ప్రేరేపించినది. నా యీ చర్య విషయములో నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదు. చేయగల్గియుండలేదు.
నా మనస్సు పొందిన ప్రేరేపణ, దాని వలన నేను చేసి కార్యము వీటిని గురించి గౌరవనీయ న్యాయస్థానము, ఎట్టి దృక్ఫథమునైనా తీసుకొన వచ్చును. తగిన శిక్ష దేనినైనా విధించవచ్చును. నాకు ఆ విపషయములో ఏదైనా చెప్పవలెననే కోర్కెలేదు. నా పైన దయ చూపవలసినదిగా నేను కోరను. నా పక్షాన మరెవ్వరైనా నాపై దయ చూపవలసినదిగా యాచించుటను కూడా నేను కోరను.
ఈ విచారణలో నాతోబాటు చాలమంది కుట్రదారులుగా కలుపబడియున్నారు. నేను నిర్వర్తించిన ఈ కార్యములో నాకు సహచరులెవ్వరూ లేరని, నా చర్యకు నేను ఒక్కడినే స్వయముగ బాధ్యుడనని ఇదివరకే చెప్పియున్నాను. వారందరిని నాతో కలిసి కట్టకపోయి యుంటే, నా కొరకు ఏలాటి సమర్థన కూడా నేను ఇచ్చి యుండేవాడిని గాను. 1948 జనవరి 30తేది జరిగిన సంఘటనతో సంబంధముగల ఏ సాక్షిని ప్రశ్నించవద్దని నా పక్ష న్యాయవాదులకు నేను ఇచ్చిన సూచలనను బట్టి నా వైఖరి తెలుస్తూనే వుంది.
పటిష్టమై ప్రచారము కొరకైనా సరే శాంతియుతమైన ప్రదర్శన సచనను 1948 జనవరి 20తేదిన కూడా నేను స్వయముగ ఎప్పుడు అంగీకరించ లేదనే విషయమును ఇంతకుముందే స్పష్టము చేసియున్నాను. అయినప్పటికీ తీవ్రమైన అయిష్టముతో అయినప్పటికీ గాంధీజీ ప్రార్థనా సమావేశములో జరుగు శాంతియుత ప్రదర్శనలో పాల్గొనుటకు ఒప్పుకొనినాను. ఏదో ఒక కారనంగా అటువంటి ప్రదర్శనను కూడా ప్రయోజనకరంగా ప్రదర్శించలేకపోవడంతో నాలో చాలా నిరుత్సాహము, తెంపరితనము ఏర్పనడినవి. బొంబాయి, పూనే, గ్వాలియర్లలో స్వచ్చంద సేవకులను సేకరించుటకు ఆప్టే తదితరులు చేసి ప్రయత్నములు విఫలమైనవి. అప్పుడు ఈ తీవ్రమైన చర్య తీసుకొనుట తప్ప మరి ఏ మార్గము నాకు గోచరించలేదు.
తరువాయి భాగం రేపు
