26.2 C
Hyderabad
Sunday, August 2, 2026
No menu items!

నాథురాం గోడ్సే వాంగ్ములం “గాంధీహత్య”

(నిన్నటి తరువాయి)

గాంధీజీ రాజకీయములలో, ఆలోచనా విధానములో, కారణ సమన్వయములో ఒక నిబద్ధమైన పద్దతికి స్థానము లేదు. ఒక్క గాంధీజీ నిర్వహించగలిగినదే సత్యము. ఆత్మ బలము, అంతర్వాణి, నిరాహార దీక్ష, మానసిక కనైర్మల్యము అనే పాతకాలపు మూఢవిశ్వాసాలు ఆయన రాజకీయములను బలపరచినవి.

గాంధీజీ ఒకసారి చెప్పినాడు: ‘‘హింసతో ఈనాడే పొందగల్గే స్వాతంత్య్రము కన్న అహింసతో వేయి సంవత్సరముల తర్వాత పొందగల స్వాతంత్య్రము కోరదగినది’’. అని ఆయన చెప్పిన విధముగ ఆచరించినడా లేక ఆయన మాటలు చేతలు పరస్పర విరుద్ధములాగా వున్నవా? అను విషయమును పైన తెల్పిన ఉదాహరణముల వలన కొంతవరకు ఆర్థము చేసుకొనవచ్చును.

ఆయన అహింసా సిద్ధాంతములను వైసరుధ్యములకు ఇటీవలి ఉదాహరణ నొకదానిని ప్రత్యేకముగా పేర్కొనవలసియున్నది. పాకిస్థాన్‌ సమస్యను వెంటవెంటనే అనుసరించి కాశ్మీరు సమస్య వచ్చినది. కాశ్మీరును జయించి దిగమ్రింగుటకు పాకిస్థాన్‌ భయంకరమైన యుద్ధమును ప్రారంభించినది. ఘనత వహించి కాశీంత్పమరు మహారాజా వారు నెహ్రు ప్రభుత్వము నుండి సహాయమర్థించినారు. అందుకు బదులుగా షేక్‌ అబ్దుల్లాను ప్రధాన పాలనాధికారిగా నియమించే నిబంధనమీద సహాయము చేయుటకు నెహ్రు గాంధీజీని సంప్రదించినాడు. కాశ్మీరు నెహ్రు జన్మస్థానమైనందున ఇందులో పక్షపాతముతో వ్యవహరించుటకు అవకాశము వున్నది. ఈ పక్షపాతమునకు అవకాశము లేకుండా వుండుటకు కాశ్మీరులోనికి బారత సైన్యము పంపు విషయములో నెహ్రు గాంధీజీతో సంప్రదించినాడు. గాంధీజీ అంగీకారముతోనే నెహ్రు కాశ్మీరును రక్షించి కాపాడుటకు సైన్యములను పంపినాడు. ఆయన ఉపన్యాసములలో ఒకదానిలో నెహ్రు స్వయముగా దీనిని గూర్చి చెప్పినాడు.

దాడి మూకలచే చేయబడే కాశ్మీరు దండయాత్ర పాకిస్థాన్‌చే బలపరచబడుతున్నదని మన రాజకీయ నాయకులకు మొట్టమొదటి నుండి తెలుసు. అందువలన కాశ్మీరుకు సహాయము పంపడం అంటే నేరుగా పాకిస్థాన్‌కు వ్యతిరేకముగా యుద్దము చేయుటే అని కూడా అందరికి తెలిసినదే. గాంధీజీ స్వయముగ ఆయుధములతో చేయబడు యుద్ధమునకు వ్యతిరేకి. ఆయన ఈ విషయమును ప్రపంచముతటా పదేపదే చాటించుకొనినాడు. కానీ ఆయన కాశ్మీరలోనికి సైన్యము పంపుటకు నెహ్రుకు తన సమ్మతి తెలిపినాడు. ఈనాడు విభజిత భారతదేశము స్వాతంత్య్రమును పొందిన తర్వాత గాంధీజీ ఆశీర్వాదములతో మన ప్రభుత్వము మానవసంహర యంత్రాంగమున ఉపయోగించి యుద్ధము చేయబూనినది. కాశ్మీరులో జరుగుచున్న దానిని బట్టి మనము తీర్మానించుకొనవలసి యున్నది.

గాంధీజీ కనుక అహింసా సిద్ధాతములో దృఢమైన నమ్మకమే వుండివుంటే సాయుధబలములకు బదులు సత్యాగ్రహులను పంపవలసినదిగా తన అభిప్రాయమును తెలిపి ఆ విధముగ ఒక సత్యశోధనమునకై ప్రయత్నము చేసి యుండవలసినది. రైఫిల్స్‌కు బదులు ‘తఖ్లీలు’ తుపాకులకు బదులు ‘చర్ఖాలు’ పంపవలసినదిగా ఆజ్ఞాపించి వుండవలసినది. స్వాతంత్య్రమున ప్రారంభములో తను ప్రవచించిన సూత్రమును పాటించి సత్యాగ్రహము యొక్క శక్తిని ప్రదర్శించుటకు గాంధీజీకి అది ఒక బంగారము వంటి అవకాశము.

(మిగితా రేపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles