26.2 C
Hyderabad
Sunday, August 2, 2026
No menu items!

నాథురాం గోడ్సే వాంగ్ములం “గాంధీహత్య”

(నిన్నటి తరువాయి)

కానీ గాంధీజీ అటువంటిదేమీ చేయలేదు. స్వతంత్ర భారత అవతరణ ప్రపథములోనే తన సొంత సమ్మతితో ఒక కొత్త యుద్ధమును ప్రారంభింప జేసినాడు. ఈ సమన్వయ రాహిత్యమునకు ఆర్ధమేమిటి? తాను ప్రభోదించిన అహింసా సిద్ధాంతాలను గాంధీదజీ ఎందువలన తానే అంత దురుసుగా తన కాళ్లతో తొక్కివేసినాడు? ఆయన ఈ విధముగ చేయుటకు కారణమేమిటో నాకు బాగుగా తెలుస్తూనేయున్నది. అది ఏమిటంటే, ఈ యుద్దము షేక్‌ అబ్దుల్లాకుగాను చేయబడుతున్నది అని. కాశ్మీరులో రాజ్యపాలనాధికారము ముస్లింల చేతులలోనికి పోయినది. ఈ కారణమువలన, ఈ ఒక్క కారణమువలననే గాంధీజీ దాడి మూకలను సాయుధ ధళములచే ధ్వసంము చేయించుటకు సమ్మతించినాడు. కాశ్మీరు యుద్ద భయంకరమైన వార్తలను ఒకవైపు చుదువుచూనే గాంధీజీ మరియొకవైపు డిల్లీలో కొద్దిమంది ముస్లింలు క్షేమంగా నివసించుటకు వీలుగా లేదన్న ఒక్క కారణంలోనే నిరాహార దీక్ష బూనినాడు. అయితే కాశ్మీరుపై దాడి చేసిన వారిముందు నిరాహార దీక్ష బూనే ధైర్యముగాని, వారికి వ్యతిరేకముగా సత్యాగ్రహము చేయగల మనస్థైర్యము గాని ఆయనకు లేకపోయినది. హిందువులను బలవంతముగా లొంగదీసుకొనుటకు మాత్రమే ఆయన నిరాహారదీక్షలు.

ఈ 20వ శతాబ్దములో ఇటువంటి కపటి అఖిల భారత రాజకీయముల నాయకుడుగా గౌరవింపబడటం ఒక దురదృష్టకరమైన విషయముగానే భావించినాను. హైదరాబాదు సంస్థానములో హిందువులపై జరిగిన దాడులు ఈ మహాత్ముని మనస్సుపై ఎలాంటి ప్రభావము చూపలేదు. ఈ మహాత్ముడు హైదరాబాదు నిజామును తన సింహాసనమును త్యజించి పొమ్మని ఏనాడు అడగలేదు. భారత రాజకీయములు గాంధీజీ మార్గదర్శక ప్రాబల్యంలో ఈ విధంగా కొనసాగితే, ఈనాడు సంపాదించుకొని యున్న స్వాతంత్య్రమును విభజిత భారతదేధంలో ఐనప్పటికి నిలబెట్టుకొనడం అసాధ్యము అవుతుంది. ఈ ఆలోచనలు నా మనస్సులో పదే పదే రేగినవి. నా మనస్సును పూర్తి నింపివేసినవి. ఈ సంఘటనలు ఒకవైపు జరుగుతూనే వుండగా, 1948 జనవరి 13వ తేది హిందూ ముస్లిం ఐకమత్యము కొరకై గాంధీజీ నిరాహారదదీక్ష ప్రకటించబడిరది. ఇక నా మానసిక భావములపై నా పట్టు తప్పిపోయినది.

గత నాలుగు సంవత్సరములుగా నేను ఒక దినపత్రిక సంపాదకుడుగా పనిచేయచుండినాను. అంతకు ముందు కూడా నాకాలములో అధిక భాగమును ప్రజాసేవకై వినియోగించుచుండినాను. అట్లా వుండినందువలన, భారత రాజకీయ పరిణామములకు సన్నిహితంగా వుండటం అలవాటు చేసుకొన్నాను. మూడు రాజకీయ సంస్థల ముస్లింలీగు, కాంగ్రెసు, హిందు మహాసభల నడుమ గల పరస్పర సంబంధములను గూర్చి నేను సంపూర్ణమైన యొరుక కల్గియుండినాను. ముస్లింలీగు, కాంగ్రెసు హిందూ సంస్థయని ఆరోపిస్తూ వుండేది, కాని కాంగ్రెసు వారు హిందూ సంస్థగా పిలువబడుట అవమానముగా భావించేవారు. ‘‘మతతత్వ వాదులు’ అని పిలుస్తే చాలు, కాంగ్రెసు వారు తాము దూషింపబడినట్లుగా భావించేవారు.

(మిగితా రేపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles