(నిన్నటి తరువాయి)
గాంధీజీ, సుభాష్ చంద్రబోసు సాగించిన భారతదేశ దండయాత్రను వ్యతిరేకించినాడు. జపాన్ వారి దాడిని సుభాష్ బలరచుట తనకు సమ్మతము కాదనే కారణంతో నెహ్రు ఆయనను వ్యతిరేకించినాడు. బోసుకు ఇతర భారత నాయకులకు నడుమ ఏమి విభేదములున్నప్పటికీ, ఆయన బ్రిటిష్ సామ్రాజ్యవాదమును నాశనము చేయుటకు ఒంటరిగా చేసిన ప్రయత్నముల వలన సుభాష్ చంద్రబోస్ ఏ ఇతర నాయకునికి లేనంతగా ప్రజల ప్రేమాభిమనములను పొందినాడు. జపాను సైన్యముల ఓటమి తర్వాత 1945లో సుభాష్ గనుక బ్రతికి యుండి భారతదేశములో ప్రవేశించి యుండిన యెడల భారతీయులంతా ఒక్క మనిషిగా ఆయన వెనుక నిలిచి, ఎంతో అదరాభిమానములతో ఆయనకు స్వాగతము పలికి యుండెడివారు. కాని గాంధీజీ మరింత అదృష్టవంతుడు. లోకమాన్య తిలక్ 1920లో చనిపోయినందున అడ్డు ఆపు లేని నాయకుడైనాడు. సుభాష్ చంద్ర విజయము గాంధీజీకి సమూల వినాశకారి అయిన ఓటమిగా ఉండేది. కాని అదృష్టము గాంధీ పక్షపాతి గనే వుండినది. సుభాష్ చంద్రబోస్ భారతదేశమునకు బయట చనిపోయినాడు. ఇక అప్పుడు సుభాష్ చంద్ర బోస్ ప్రవేశపెట్టిన ‘‘జైహింద్’’ నినాదాన్ని కూడా వినియోగించుకొనసాగినారు. వారు సుభాష్ సంస్మరణుర్థము ఐ.యన్.ఏ.లను వ్యాపార సరళిలో ఉపయోగించుకొనినారు. సుభాష్ సంస్మరణార్థము వారు ప్రదర్శించిన కపటమైన గౌరవ మర్యాదలు 1945`46 ఎన్నికలలో వారు గెలుచునట్లు చేసినవి. ఇంకా తాము పాకిస్థాన్‌కు వ్యతిరేకులమని, దానిని ఎటువంటి పరిస్థితులలోను ఏర్పడకుండ నిరోధిస్తామని, కాంగ్రెసు పక్షము వాగ్ధానము కూడా చేసినది. కాని ఆచరణలో ఐ.యన్.ఏ.ను చాలా చులకన చేసినారు. ఇక పాకిస్థాన్‌కు సరే పూర్తిగా లొంగిపోయినారు. ఈ విధముగ రెండు విషయములలోను కాంగ్రెసు వారు వాగ్దాన భంగము చేసినారు.
ఇదంతా జరిగే సమయములో ముస్లింలీగు భారతదేశ శాంతి భద్రతలకు భంగము కలిగిస్తూ హిందువుల హత్యాకాండ జరుపుతూ దేశ ద్రోహ చర్యలను కొనసాగిస్తూనే వుండినది. కాంగ్రెసు ఎంత త్యాగమైనా చేసి ముస్లింలను సంతృప్తి పరచాలనే విధానమును కొనసాగించుటకై ఈ సామూహిక హత్యాకాండను ఖండిరచడానికి గాని, ఆపడానికి గాని సాహసించలేకపోయినది. గాంధీజీ ఆయన అనుసరించే సంఘ సేవా పద్దతికి సరిపోని ప్రతిదానిని అణచివేసినాడు. అందువలన, స్వాతంత్య్ర సాధన గాంధీజీ వలన జరిగినదనే వాదనను పదే పదే చెసినప్పుడు నేను ఆశ్చర్యపడిపోయినాను. ముస్లింలీగును అదేపనిగా సంతృప్లిప పరచడం స్వాతంత్య్ర సాధనకు మార్గము కాదనేది నా స్వకీయ విశ్వాసము. దృక్పథము. ఈ సంతుష్టీకరణము తుదకు భారత భూభాగములో మూడవ భాగమును మ్రింగి, ఒకప్పుడు భారత భూభాగమైన దానిలో ప్రతికూలము, దురాశా పూరితము, అహితము, కలహమునకు కాలు దువ్వు పొరుగును శాశ్వతముగ నెలకొల్పి తుదకు తన సృస్టికర్తనే కబళించిన ‘‘ఫ్రాంక్లిన్ స్టీన్’’ భూతమును సృష్టించినది. స్వరాజ్యమును సంపాదించుటలో గాంధీజీ చేసినది అత్యల్పం మాత్రమేనని నేను భావిస్తున్నాను. కాని ఆయనకు సదుద్ధేశ్యపరుడైన దేశభక్తుడుగా ఒక స్థానము కల్పించుటకు మాత్రము నేను అంగీకరిస్తాను.
(మిగతా రేపు)


