
తెలంగాణ సామ్నా డెస్క్: ప్రయోగ్‌రాజ్‌లో సుమారు 60 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు అని వింటున్నాం. అది ఆధ్యాత్మిక కార్యక్రమం. అలాగే ఆదివారం చాంపియన్స్ ట్రోపిలో భాగంగా దుబాయిలో జరిగిన పాకిస్థాన్ ఇండియా మ్యాచ్ క్రికెట్ కంభమేళాను తలపించింది అనే వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఇది దేశభక్తి ప్రేరేపితమైన ఉత్తేజకరమైన కార్యక్రమం. ప్రయోగ్‌రాజ్‌లో గంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తే. దుబాయ్‌లోని క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా వీక్షించి ఆనందాన్ని పొందారు. జియోహట్‌స్టార్‌లో సుమారు 60 కోట్ల మంది వీక్షించారు. దీనికి అదనంగా టివిల్లో ఇతరత్రా గమనించిన వారి సంఖ్య మరో 30 కోట్ల వరకు వుండవచ్చన్న అంచనాలు వస్తున్నాయి.
ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఇరుదేశాల్లో ఒక ఉత్సాహం ఉద్రేకం కలగలసిన పోటీ కనిపిస్తుంది. అది క్రికెట్‌కే పరిమితం కాకుండా హకీ, కబడ్డీలతో పాటుగా ఏ ఆట అయినా ఇరుదేశాల్లో కనిపించే తీవ్రత ప్రత్యేకమనే చెప్పవచ్చు. గెలిచిన దేశ ప్రజలు సంబరాలు చేసుకోవడం, ఓడిపోయిన దేశంలో టీవిలు పగలగొట్టడం నిరసనలు చేయడం లాంటి సంఘటనలు ప్రజలు గమనిస్తూనే వుంటారు. అలాంటిది ఒక ట్రోఫికి సంబంధించిన పోటీలో తీవ్రత వుండకుండా వుంటుందా? ఆ పోటీ క్రమంలోనే సుమారు 90 కోట్ల మంది అదివారం జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా గమనించడం, అందులో ఇరుదేశాలకు సంబంధించిన అభిమానులు ఎక్కువ సంఖ్యలో వుంటారనే చర్చ రావడంతో ఇది ‘‘మరో క్రికెట్ కుంభమేళా’’ అనే ప్రశంసలు వస్తున్నాయి.
