(నిన్నటి తరువాయి)
- నా పత్రికలు ‘‘ఆగ్రణి’’, ‘‘హిందూరాష్ట్ర’’లలో నేను ఎల్లప్పుడు గాంధీజీ అభిప్రాయములను, ఆయన తన లక్ష్యములను సాధించుటకు అనుసరించుచుండిన నిరాహారదీక్ష వంటి పద్దతులను తీవ్రముగ విమర్శించుచుండెడివాడను. గాంధీజీ ప్రార్ఘనా సమావేశములను ఏర్పాటు చేయుట ప్రారంభించినప్పుడు, మేము, అనగా ఆప్టే మరియు నేను అందుకు వ్యతిరేకతను చూపు శాంతియుత ప్రదర్శనములు చేయ సంకల్పించినాము. పంచాగ్ని,పూణే, బాంబే, డిల్లీలలో మేము అట్టి ప్రదర్శనములను జరిపినాము. మా ఆదర్శముల నడుమనున్న ఆగాధము పెద్దదే. కానీ, గాంధీజీ లేక గాంధీజీ మార్గదర్శనంలో వుండే కాంగ్రెసు సూచన మేరకేతేనేమీ, బుద్దిపూర్వకమైన ఉపేక్షవల్లనేతేనేమీ ఒకటి వెంట ఒకటిగా ముస్లింలకు చెందకూడని హక్కులు 1947 ఆగస్టు 15వ తేది దేశవిభజనతో పరాకాష్ఠకు చేరే విధంగా ధారారదత్తము కావడంతో మా ఆదర్శముల నుడుమనున్న ఆఖాతము ఇంకా ఇంకా ఎక్కువైపోయినది. ఈ విషయమునే ముందుముందు ఇంకా విశదీకరింపబోవుచున్నాను. 1948 జనవరి 13వ తేది గాంధీజీ మరణ పర్యంత నిరాహారదీక్ష పూనుటకు నిర్ణయించుకొనినాడని తెలిసినది. ఈ నిరాహారదీక్షకు ఇవ్వబడిన కారణములు ఏమిటంటే, అయననకు భారత రాజ్యములో హిందూ ముస్లిం ఐక్యత నెలకొల్పబడునని హామీ కావలెననుట మాత్రమే. కాని, ఈ నిరాహారదీక్ష వెనకనున్న అసలు ఉద్ధేశ్యము హిందూ ముస్లిం ఐక్యత మాత్రమే గాదనియు, భారత ప్రభుత్వము పాకిస్థాన్‌కు ఇచ్చుటకు ఖచ్చితముగ తిరస్కరించిన 55 కోట్ల రూపాయలను పాకిస్థాన్‌కు ఇచ్చుటకు భారత ప్రనభుత్వాన్ని ఒత్తిడి చేయుటకు మాత్రమేనని నేను, నా వలె అనేక మంది, స్పష్టముగా చూడగల్గినాము. దీనికి జవాబుగా, పాత పద్దతిలోనే ఒక బలమైన ఐతే శాంతియుతముగ ప్రదర్శనను గాంధీజీ ప్రార్థనా సమావేశము ముందు జరుపవలెనని ఆప్టే సూచించినాడు. దీనివలన సాధింపడేదేమీ లేదు కావున, నేను దీనిని ఆర్ధమనస్సుతో అంగీకరించినాను. దీనికి ప్రత్యామ్నాయమైన పథకమును ఏమీ అంతవరకు నా మనస్సులో నిర్దారించుకొనననందుననే అతనితో చేరుటకు నేను అంగీకరించినాను. ఈ ఉద్ధేశ్యముతోనే నేను, ఆప్టే 1948 జనవరి 14 తేదిన బొంబాయికి పోయినాము.
- 1948 జనవరి 15 తేది ఉదయం ఆప్టే, నేను దాదరులోని హిందూ మహాసభ కార్యాలయమునకు పోవుట సంభవించినది. అచ్చటనే బాడ్గెను నేను చూచుట తటస్థించినది. మస్.డి.ఆప్టేను, నన్ను చూడగానే, బాడ్గె సమాధానం చెప్పినాడు. అందుమీదట బాడ్గె తనంతట తానే, అక్కడికి వచ్చుటకు ఆక్షేపణ లేని పక్షములో డిల్లీకి వచ్చి ప్రదర్శనలో పాల్గోనుటకు సంసిద్దత తెలిపినాడు. మమ్ము బలపరిచి, నినాదములు చేయు మనుష్యులు కావలసి యున్నందున అతని రాకకు మా సమ్మతి తెలిపినాము. మేము ఎప్పుడు బయలదేరేది కూడా తెలిపినాము. అందుమీదట బాడ్గె తాను ప్రవీణచంద్ర సేథియాకు కొన్ని వస్తువులను ఇవ్వవలసియున్దనియు, ఆ పనిని ఒకటి రెండు రోజులలో పూర్తి చేసుకొని 1948 జనవరి 17 తేది మాకు కనిపించగలనని తెల్పినాడు.
(తరువాయి రేపు)
