(నిన్నటి తరువాయి)
- ఆరోపణ పత్రములో ‘‘ఆరవది’’ అను శీర్షికలో ఎ(1), ఎ(20 నేరాలలోని అభియోగము విషయముగా, నేను, నారాయణ ఆప్టే సహయముతో లైసెన్స్‌లేని పిస్తోలును, మందుగుండు సామాగ్రిని దిగుమతి చేసుకొనుటకు గాని ఇతర విధములాగా సంపాదించుటను గాని చేయలేదని చెప్పుచున్నాను. డాక్టరు దత్తాత్రేయ యస్. పర్పూచరే, నారాయణ డి. ఆప్టే ఆ పిస్తోలును సంసాదించినారనుటను, లేదా నేను ఆ పిస్తోలును మందుగుండు సామాగ్రిని సంపాదించుటలో వారివురితో కలిసిగాని వారిలో ఏ ఒక్కరికి గాని సహాయము చేసి నారనుటను గూడ నేను తిరస్కరించుచున్నాను. దీనికి సంబంధించి నేరారోపకులు ప్రవేశపెపట్టిన సాక్ష్యము నమ్మదగినది కాదని కూడా నేను చెప్పుచున్నాను. పైన చెప్పిన వానికి భంగము లేకుండ నేను ఇంకో విషయము కూడా చెప్పుచున్నాను. ఒక వేళ పేరాలు ఎ(1),ఎ(2) లలో చెప్పబడిన కార్యములు జరుపబడియుండిన, అట్టి వాటిని విచారించుట గౌరవనీయమైన ఈ న్యాయస్థాన పరిధిలోనికి రాదు. నాకు సంబంధించినంత వరకు ఆరోపణ ఏదైనా వున్న యెడల అదది ఇదే శీర్షిక క్రిందవున్న పేరా బి(1) లోని ఆరోపణతో కలసిపోవునని కూడా నేను చెప్పుచున్నాను.
- పేరాలు భి(1), బి(2) లోని ఆరోపణల విషయంలో నేను 606824 నెంబరు గల ఆటోమెటిక్ పిస్టలును, దానికి వలసిన గుండ్లను నా స్వాధీనములో ఉంచుకొని యుండినానని ఒప్పుకొనుచున్నాను. కానీ నా స్వాధీనములో నుండిన పిస్టలుతో నారాయణ డి. ఆప్టే గాని, విష్ను ఆర్ కర్కారే గాని ఎంలాంటి సంబంధము లేదని కూడా చెప్పుచున్నాను.
15.‘‘ఏడవదిగా’’ అను శీర్షిక క్రింద గల ఆర్పోణల విషయమునకు ముందు నేను డిల్లీకి వచ్చుట ఏ విధముగ జరిగినది, నేను డిల్లీకి ఎందుకు వచ్చినాను అను వియములను వివిరంచుట అప్రస్తుతముగా వుండబోదని నేను భావించుచున్నాను. గాంధీజీ అనుసరించే వానికి పూర్తిగా వ్యతిరేకమైన సిద్ధాంతాలను, ఆలోచనా విధానాలను నేనుబలపరచడి వాడిననే విషయాన్ని నేను ఎప్పుడు రహస్యముగ వుంచలేదు. గాంధీజీ చే ప్రబోధింపబడిన సంపూర్ణ ‘‘అహింసా’’ తుదకు హిందువులనున నిర్విర్యులుగ చేసి తమపై ఇతర వర్గములు, ముఖ్యముగా ముస్లింలు చేయు దురాక్రమణలను, దాడులను నిరోధించుటకు కూడా ఈ జాతి అసమర్థమై పోపవునని నేను దృఢముగ నమ్మినాను. - ఈ కీడును పరిహరించుటకు నేను ప్రజా జీవితములోనికి ప్రవేశించుటకు నిర్ణతయించుకొని అటువంటి భావములు కల్గిన వ్యక్తులను కొందరిని సమీకరించినాను. ఇందులో ఆప్టే, నేను ప్రధానపాత్ర వహించి ప్రచార సాధనములు ద్వారా ‘‘ఆగ్రణి’’ దిన పత్రికను ప్రారంభించినాము. ఇచ్చట నేను ఒక విషయమును విశదీకరించుచున్నాను. నేను నా అనుయాయులు గాంధేయ అహింసా బోధనలకన్నా గాంధీజీ తన భావములను ప్రవచించి హిందుజాతికి దాని హక్కులకు వ్యతిరేకముగ, హానికరముగా పరిణమిచేటట్టు ముసి ్లంలయెడ ఎల్లప్పుడు పక్షపాతవైఖరిని ప్రదర్శించిఅవలంబించుచుండిన వైఖరిని తీవ్రముగ వ్యతిరేకించినాము. నా దృక్పథమును మరింత వివరముగ ముందు ముందు విశదీకరించుబోవుచున్నాను. అంతేకాదు. హిందూజాతా పొందిన అనుభవించిన అనేక దురదృష్టములకు గాంధీజీ ఏ విధముగ బాధ్యుడనేది ఎలాంటి సందేహము లేకుండా నిరూపించుటకు వలసిన అనేక దృష్టాంతములను కూడా చూపబోవుచున్నాను.
(తరువాయి బాగం రేపు)
