(నిన్నటి తరువాయి)
గోపాల్ గోడ్సే కథనము
జరిగిన రక్తపాతానికి ఇంకా కొంత చేర్చబోతున్నాడు హృదయ రహితముగ ఆ అధికారి.
తన నిట్టూర్పుల వెకక కన్నీటిని దాచిపెట్టకొనుటకు ఆయన చేయు ప్రయత్నాన్ని మేము చూచినాము. నాథూరామ్ బదులుగా ఆయన ఎలా చిరునవ్వు నవ్వగలడు?
అయినప్పటికా, అది మరణశిక్ష పొందబోవువాని చివరి కోరికగా వుండవచ్చునని భావించినడు. అతనిని ఎందుకు సంతృప్తిపరచరాదు? బలవంతముగా ముఖముపైకి చిరునవ్వు తెచ్చుకొని ఏమిటి విశేసం అన్నట్లు నాథురాం వైపు చూచినాడు.
‘‘శ్రీమాన్‌జీ, మీకు జ్ఞాపకము వుందా! అన్నాడు నాథురామ్. ‘‘మేము ఒకసారి మీతో అన్నాను. ఉరిత్రాడును గురించి నేను లెక్కపెట్టను. కాని ఉరిత్రాడుతో ఊగులాడే ముందు ఒక కప్పు కాఫీ మాత్రము నాకు తప్పకుండా ఇవ్వాల ’’ అని ఆ కప్పు వంతు ఇప్పుడు వచ్చినది. మీకు నా కృతజ్ఞాతాభివందనులు!’’.
శ్రీ అర్జునదాసు ఎలుగెత్తి ఏడ్వకపోవడం ఒక్కటే తక్కువ
తర్వాత నాథూరామ్ డాక్డర్ వైపు చూచినాడు. ఆయనతో అన్నారు. ‘‘డాక్టరు బాబ్దా నీ పుస్తకము మీద నా చేవ్రాలు చేసి కారాగార సహాయ నిర్వహణాధికారి శ్రీ త్రిలోక్‌సింగ్ వద్ద ఇచ్చినాము. నీకు ఇంతకన్న ఎక్కువ చేవ్రాళ్లు ఏమీ అవసరము లేదని భావిస్తాను!’’
నాథూరామ్ అంతకు ముందు తన మేనమామతో మాఇట్లాడినంత తేలికగానే మాట్లాడినాడు. అతను అన్నాడు. ‘‘మామ, నీ వెయ్యి రూపాయలు నీకు తిరిగి ఇచ్చుటకు ఏర్పాట్లు చేసినాను’’
నారాయణ ఆప్టే తన పరిశోధనా వ్యాసాన్ని పంపు విషయము సూపరిటిండెంటుకు జ్ఞాపకం చేసినాడు. నారాయణ కడవటి పది దినాలలో పరిపాలనా వ్యవస్థను గూర్చి ఒక పరిశోధక వ్యాసము వ్రాసినారు.
దానిని సూపరింటిండెంటు ప్రభుత్వానికి పంపినాడు. కాని ప్రభుత్వము మాత్రం దానిని ఇంతవరకు ఆప్టే భార్యకు గాని, సోదరులకుగాని అందజేసి యుండలేదు.
అచ్చటనే వుండిన జిల్లా మ్యేజిస్ట్రేటు శ్రీ సర్వోత్తమ షగాల్ ఆ ఇద్దరు అంతు తెలియనిచోటికి పాస్‌పోర్టులు కలిగియాన్నారా. ఉన్న ఎడల అని న్యాయశాస్త్ర బద్దమైనవేనా అని విచారించి తెలుసుకొనినాడు.
ఆ ఇద్దరు జీవితము అవలివైపుకు ప్రయాణము ప్రారంభించినారు. వారు భగవద్గీత ఆఖండ భారతదేశ పటము, కాషాయ జండా చేతబట్టుకొని ముందుకు సాగినారు.
మరణశిక్ష పొందనవారి ఆవరణకు వెనక వైపున వేదిక అమర్చబడినది. అందులో అమర్చబడిన ఉరి దూలము ఒకసారికి ముగ్గురికి సరిపోవును.
(తరువాయి బాగం రేపు)
