తెలంగాణ సామ్నా: కామారెడ్డి జిల్లా బిక్కునూర్ యస్‌ఐసాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ శృతిల సామూహిక ఆత్మహత్యల వెనక ట్విస్టులు చాలానే వున్నట్లు సమాచారం. మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తరువాత శృతి నిఖిల్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మధ్యకాలంలోనే యస్‌ఐ శృతి మధ్యన సాన్నిహిత్యం పెరిగింది. వీరిద్దరి మధ్యన వున్న సాన్నిహిత్యం తెలిసిన సాయికుమార్ భార్య మహలక్ష్మీ భర్తతో గొడవ పడినట్లు తెలుస్తుంది. వారిద్ధరి శారీరక బంధంపై మహలక్ష్మీ శృతిని కూడా నిలదీసినట్లు వినికిడి. తాను విడాకులు ఇవ్వకుండా నీవు చేసుకునే పెళ్లి ఎలా చెల్లుతుందని గొడవ పడిరది. అయితే చట్ట ప్రకారం చెల్లకపోయిన తనను పెళ్లి చేసుకోవాలని శృతి సాయికుమార్‌ను అడిగింది.
ఈ గొడవ రోజురోజుకు ముదరడంతో మహలక్ష్మీ గర్బవతిగా వున్నా కూడా పుట్టింటికి వెళ్లిపోయింది. దీనితో సాయికుమార్‌కు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఎలాంటి అనైతికతకు తావు లేకుండా వుంటే శృతి, నిఖిల్ పెళ్లి చేసుకవాల్సిన సమయలో శృతి సాయికుమార్ వివాహేతర సంబంధం బలంగా మారింది. ఇందులో శృతి కంటే కూడా సాయి కుమార్ చాలా లోతుగా ప్రేమలో కూరుకుపోయాడని అంటున్నారు. తాను పెళ్లి చేసుకోవాలనుకున్న శృతిని సాయికుమార్ వదలకపోవడంతో నిఖిల్ జిల్లా స్థాయి ఉన్నతాధికారులను ఆశ్రయించి సమస్య పరిష్కరించమని వేడుకున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించడానికి ఇద్దరు అధికారులు సైతం మధ్యవర్తులుగా వుండడానికి అంగీకరించినట్లు సమాచారం. అయితే తనను వదలి నిఖిల్‌ను ఎలా పెళ్లి చేసుకుంటావు? అని సాయికుమార్ చేస్తున్న గొడవకు పరిష్కారం వెతుక్కునే క్రమంలో చెరువు దగ్గరికి ముగ్గురు చేరుకోవడం జరిగింది. ఇంతవరకు జరిగిన సంఘటనకు పోలీసుల వద్ధ వాట్సప్ చాటింగ్‌లు, ఫోన్ కాల్ రికార్డులు, వ్యక్తిగత రికార్డులు వున్నట్లు సమాచారం.
ఆ తరువాత సీన్ చెరువు వద్ధకు చేరింది. ముగ్గురు ఒకచోటికి చేరారు. ఇంతవరకు ఖచ్చితంగా జరిగింది అని చెప్పుకోవడానికి ఆవకాశం వుంది. ఇక ఏం జరిగింది అనేదానికి కేవలం ఊహగానాలు, అంచనాలే ఆధారాలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది స్థానికులు, వారి గురించి తెలిసిన వారు ఊహిస్తున్న దాని ప్రకారం ముగ్గురి మధ్యన మాట మాట పెరిగి గొడవ పెద్ధదయినట్లు ఊహిస్తున్నారు. ‘‘ నీవు మనసు దోచుకున్నదానివి, నీవు వావి వరుసలున్న దానివి’’ అనే దసరాబుల్లోడు సినిమా స్టయిల్లో విషాద, విరహ, ట్రాజెడీ సీన్లు పూర్తయ్యాకా క్ల్తేమాక్స్‌లో గొడవ పెరిగి శృతి సహనం కొల్పోయి
చెరువులో దూకింది. ఆమెను రక్షించే క్రమంలో నిఖిల్, సాయికుమార్‌లు కూడా చెరువులోకి దూకడం జరిగింది. అయితే ముగ్గురిలో ఎవరికి ఈత రాకపోవడంతో పాటు నీటిలో వున్న నాచు శరీరానికి చుట్టుకొని ప్రాణాలు కోల్పోయినట్లు ఊహిస్తున్నారు.
సభ్య సమాజం చీదరించుకునే ఓ అనైతిక ఆత్మహత్యల సంఘటన సంపుటి వ్యవహరంలో సమాజానికి మార్గదర్శనం చేసే స్థితి, స్థాయిలో వున్న ఓ పోలీస్ అధికారి వుండడంతో పాటు ఓ మహిళా కానిస్టేబుల్ వుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆత్మహత్యల విషయంచర్చానీయాంశంగా మారి సంచలనం అయ్యింది. ఈ సంఘటన ఒక రకంగా కొందరు పోలీసుల్లో వున్న నైతిక విలువల పతనాన్ని ప్రశ్నిస్తుందనేది మాత్రం వాస్తవం.
