బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ ఒడిస్సా కు వంద కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం అర్ధరాత్రి గాని లేదా శుక్రవారం ఉదయం లోపు ఒడిశాలోని పూరి సాగర్ దీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. ఈ తీవ్ర తుఫాను ప్రభావం వల్ల పశ్చిమ బెంగాల్లో ఒడిస్సాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఒడిస్సా ప్రభుత్వం తుఫాను నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించింది. కాగా ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాను ప్రభావం అంత ఎక్కువగా ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
