తెలంగాణ సామ్నా బ్యూరో: అమ్మంటే అంతులేని సొమ్మురా…అది ఏనాటికి తరగని ధాన్యంబురా… అన్నాడో కవి. అది వాస్తవం కూడా. కాని కొందరు అవన్ని వట్టిమాటలే అని, క్షణికకాల సుఖం లేని బంధమేందుకని, బాధ్యతలెందుకని సభ్యసమాజం తలదించుకునే పనులు చేస్తారు. క కనడం మాత్రమే కాదు, పెంచి ప్రయోజకుల్ని చేయాల్సిన ఓ యువతి తన ఇద్దరు కొడుకుల్ని వదిలేసి క్షణికకాల సుఖం వేటలో ఎవరితోనో వెళ్లిపోయిందన్న వార్త చర్చనీయాంశం అయ్యింది
.
జగిత్యాల జిల్లా సాతారం గ్రామానికి చెందిన నరేష్, ఓ యువతి ఇద్ధరు బార్యభర్తలు. వారికి ఇద్ధరు మగపిల్లలు. కొద్ది రోజుల క్రితం నరేష్ ఓ ఆక్సిండెట్‌లో చనిపోయాడు. ఈ క్రమంలోనే ఆ యువతి మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఇదిలా వుండగానే ఆ యువతి వున్న మహిళామండలికి లోను వచ్చింది. తన వంతుగా వచ్చిన సుమారు యాబై వేలు తీసుకున్నట్లుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆ యువతి తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో జగిత్యాల జిల్లా కేంద్రంకు వచ్చి తండ్రిని పలకరించి ఇద్దరు కొడుకులను అక్కడే వదిలి ప్రియుడితో ఉడాయించినట్లుగా చెబుతున్నారు.
ముక్కుపచ్చలారని ఇద్దరు కొడుకులను వదిలి వెళ్లిపోయిన తల్లిని తిట్టనివారు లేరు. అమాయకంగా మాట్లాడుతున్న ఆ పిల్లలను అక్కున చేర్చుకొని తండ్రిలేని కొడుకులకు ఓ మార్గం చూపించాల్సిన తల్లి ఈ రకంగా వదిలేసి పోవడం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.
