జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బండలింగాపూర్ గ్రామానికి చెందిన పోతుగంటి శ్రీనివాస్ వెల్లుల్ల గ్రామానికి చెందిన దండుగుల స్వామి మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు మెట్పల్లి పోలీసులు తెలిపారు
