
(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ వేధింపులకు నిరసనగా కోరుట్ల పట్టణంలో ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ, కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలవడం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రాజకీయ కక్ష సాధింపు చర్య అని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన కేసీఆర్ ప్రజాదరణను తట్టుకోలేకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిరంకుశ, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు, నోటీసులతో భయభ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరంతరం పోరాటం చేస్తాయని హెచ్చరించారు. కేసీఆర్‌పై జరుగుతున్న రాజకీయ వేధింపులను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరని, తగిన సమయంలో కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
