తెలంగాణ సామ్నా బ్యూరో: గత రెండు నెలల్లో రెండవసారి పోప్ ఫ్రానిస్ జారి కింద పడ్డారు. మొదటిసారి బెడ్ పైనుండి కింద పడగా తాజాగా శాంటా మార్టాలోని తన నివాసంలో ప్రమాదవశాత్తు జారి పడ్డట్లు వాటికన్ సిటి అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పోప్ ఫ్రాన్సిస్ మోచేతికి గాయాలు అయ్యాయని వారు తెలిపారు. అయితే ఎముక ఫ్యాక్చర్ కాలేదని వారు వివరించారు. వైద్యులు గాయం తగిలిన చోట చికిత్స చేసి కట్టు కట్టినట్లు తెలిపారు. కాగా పెద్ద పెద్ద రోగాలను తమ ప్రార్థనలతో తగ్గించే శక్తి వున్న వారు సైతం డాక్టర్ల దగ్గర చికిత్స చేయించుకోవడం, కట్లు కట్టుకోవడం ఏమిటనే ప్రశ్న సాధారణ ప్రజల్లో వస్తున్నది.
