32 C
Hyderabad
Friday, October 30, 2026
No menu items!

లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

(బాలే అజయ్ – 9290277727 | మన్నెగూడెం)

లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా 49 మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ భాస్కర్ మాడేకర్, లయన్ చిదుర సురేష్ సహకారం అందించారు.

మన్నెగూడెం గ్రామంలో సోమవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో మొత్తం 106 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో శస్త్రచికిత్సలు అవసరమైన 49 మందిని గుర్తించి, కరీంనగర్‌లోని రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేసిన అనంతరం గురువారం మన్నెగూడెం గ్రామానికి తీసుకువచ్చారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు, శస్త్రచికిత్సలు అవసరమైన వారికి వైద్య సేవలు అందించడం ద్వారా నిర్వాహకులు సేవాభావాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జగిత్యాల అధ్యక్షులు గుండేటి గంగాధర్, అంగడి ఆనందం, వడ్లగట్ట శంకర్, తాటిపాముల వినోద్ కుమార్, అడువాల జ్యోతి, పోతు గణేష్, కొమ్మినేని మల్లేశం, బత్తుల ప్రదీప్, అను మల్ల జలంధర్, కాసారపు లక్ష్మీనారాయణ గౌడ్, యడమల లక్ష్మారెడ్డి, దోపాటి దేవదాస్, మానపురి శ్రీనివాస్‌తో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles