(బాలే అజయ్ – 9290277727, జగిత్యాల)
లంచం తీసుకుంటూ బీర్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో గిరిధావర్ రాహుల్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఈ దాడి నిర్వహించారు.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బాధితురాలి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటుండగా గిరిధావర్ రాహుల్‌ను అధికారులు పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సంబంధిత రికార్డులను పరిశీలించిన అధికారులు, రాహుల్‌పై తదుపరి చర్యలకు సంబంధించిన ప్రక్రియను చేపట్టారు.
కాగా, రాహుల్ గతంలో కథలాపూర్ ఆర్‌ఐ-1గా విధులు నిర్వహించారు. సర్టిఫికెట్ల జారీ విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను బీర్పూర్‌కు బదిలీ చేసినట్లు సమాచారం.
