
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కోరుట్ల పట్టణానికి చెందిన పార్టీ నాయకుడు తులసి కృష్ణ నియమితులయ్యారు.
ఇందూరు పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. అనూప్ రావు, జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర సీనియర్ నాయకుడు రుద్ర శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ తులసి కృష్ణకు నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని నాయకులు సూచించారు. తులసి కృష్ణ మాట్లాడుతూ, తనపై పార్టీ అధిష్ఠానం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జిల్లా స్థాయిలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎంబేరి నాగభూషణ్, రాపెల్లి సురేష్, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎర్ర రాజేందర్, మ్యాకల గణేష్, గందె నవీన్, నేమూరి విజయ్, నారవేణి విజయ్, బొలిశెట్టి రాజేందర్, మైదం సత్యనారాయణ, రాఘవులు, ఈర్నాల స్వామి, సంకు నరేందర్, అక్మల్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
