బీజేపి జాతీయ అధ్యక్షునిగా వారణాసి రాం మాధవ్‌ను ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా వున్నట్లు సమాచారం. బీజేపి రాజకీయ వ్యూహకర్తల్లో ఒకరిగా పేరుపొందిన రాంమాధవ్ కొద్ది నెలలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించడం లేదు. అయితే
పార్టీ అంతర్గత వ్యవహరాలు నిర్వహిస్తు పార్టీ సేవలు అందిస్తున్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. రాజకీయ చతురుడుగా రాం మాధవ్‌కు పార్టీలో మంచి గుర్తింపు వున్నది. కాశ్మీర్ ఎన్నికల్లో పిడిఎఫ్‌తో పొత్తు విషయంలోను, ఉప ముఖ్యమంత్రి పది బీజేపి తీసుకోవడంలోను రాంమాధవ్ వ్యూహత్మకంగా వ్యవహరించినట్లు కార్యకర్తలు చెబుతారు. అనుభవజ్ఞుడు, విద్యావంతుడుగా గుర్తింపు పొందడంతో ప్రస్తుతం బీజేపి కేంద్ర నాయకత్వం దక్షిణాది రాష్ట్రాల్లో బలపడే దిశగా ఆలోచిస్తున్న నేపథ్యంలో రాంమాధవ్‌కు తగిన గుర్తింపు పార్టీ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాంమాధవ్‌ను అందుకు అనువైన నాయకునిగా ఆలోచించినట్లు తెలుస్తున్నది. వచ్చే సంవత్సరం మొదటి నెలలో బీజేపి జాతీయ అధ్యక్షున్ని ఎన్నుకునే నేపథ్యంలో రాంమాధవ్ గురించి చర్చకు రావడం దక్షిణాది రాష్ట్రాల బీజేపి కార్యకర్తలకు బలం చేకూరే విధంగా వుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

