(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
జగిత్యాల జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరుట్ల మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్ కలిసి పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు సూచన మేరకు చైర్‌పర్సన్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి కోరుట్ల పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఆమె కోరారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి, పట్టణ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్ తెలిపారు.
