కోరుట్ల, తెలంగాణ సామ్నా, జనవరి 1: శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చొరవతో కొండగట్టు ఆలయ అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో, ఈ నెల 03వ తేదీ శనివారం రోజున పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయానికి విచ్చేస్తున్న సందర్భంగా, కోరుట్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘చలో కొండగట్టు’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కోరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నిర్వహించబడింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, కొండగట్టు ఆలయ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ప్రత్యేక చొరవ అభినందనీయమని, భక్తులకు, హనుమాన్ దీక్ష స్వాములకు సౌకర్యాల కల్పనకు ఇది కీలకమవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కోరుట్ల నియోజకవర్గ P.O.C (పాయింట్ ఆఫ్ కాంటాక్ట్) వొడ్నాల రామారావు, ఈశ్వర్ నగర్ ఉప సర్పంచ్ బసవేని రమేష్, గుమ్లాపూర్ వార్డు సభ్యులు అడ్లగట్ట సురేష్, జనసైనికులు సాయికృష్ణ, విజయ్, సంజీవ్, శ్రీనివాస్ గాజేంగి, ప్రశాంత్, మహేష్, భాస్కర్, శశి, రాజు, రిశ్వంత్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

