(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లాలో ఇటీవల నిర్వహించిన పురపాలక ఎన్నికల అనంతరం మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవులకు సోమవారం జరిగిన ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో నూతన ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి:
జగిత్యాల మున్సిపాలిటీ:
చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి “సమీండ్ల వాణి” మరియు వైస్ చైర్మన్‌గా “జీనత్ ప్రవీణ్” ఎన్నికయ్యారు.
కోరుట్ల మున్సిపాలిటీ:
చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి “తిరుమల వసంత గంగాధర్” మరియు వైస్ చైర్మన్‌గా మహమ్మద్ షహీద్ ఎంపికయ్యారు.
మెట్పల్లి మున్సిపాలిటీ:
చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి “మైలారపు లింబాద్రి” మరియు వైస్ చైర్మన్‌గా “ఓంకారి నవీన్” ఎన్నికయ్యారు.
రాయికల్ మున్సిపాలిటీ:
చైర్మన్‌గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి “కటకం రవీందర్” మరియు వైస్ చైర్మన్‌గా తురగా సౌజన్య ఎంపికయ్యారు.
ధర్మపురి మున్సిపాలిటీ:
చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి “వేముల నాగలక్ష్మి” మరియు వైస్ చైర్మన్‌గా “ఇందారపు నాగన్న” ఎంపికయ్యారు.
ఎన్నికైన చైర్మన్లు మరియు వైస్ చైర్మన్లు సోమవారం నుండే అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, పారదర్శక పాలన అందించేందుకు కట్టుబడి ఉంటామని వారు తెలిపారు
