(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
కేరళ సంప్రదాయంలో విశిష్టమైన ఓనం పండుగను పురస్కరించుకుని కోరుట్ల పట్టణంలోని స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో ఓనం వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి చిదురాల నారాయణ, అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తోట రాజు, సహాయ కార్యదర్శులు శ్రీరాముల శ్రీనివాస్, కాసు క్రాంతి, గెల్లె గంగాధర్, బొమ్మ రాజేశం, గురుస్వాములు మంచాల రాజలింగం, సుధాకర్, గడ్డం మధు, గాజంగి లక్ష్మీపతితో పాటు వందలాది మంది భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
