
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా కోరుట్ల పట్టణంలోని 33 వార్డుల్లో గురువారం పోలింగ్ కేంద్రాల వారీగా వార్డు సభలు నిర్వహించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సభల్లో ఓటరు జాబితాల సవరణకు సంబంధించి వచ్చిన నోటీసుల్లోని పేర్లను ప్రజలకు చదివి వినిపించారు. ఓటరు జాబితాల్లో సవరణలకు సంబంధించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి వసంత తిరుమల గంగాధర్, మున్సిపల్ కమిషనర్ వి. రాఘవేంద్ర, వైస్ చైర్మన్ మొహమ్మద్ షాహిద్, కౌన్సిలర్లు, బూత్ లెవల్ అధికారులు (BLOలు), RPలు, సూపర్వైజర్లు, వార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.
