
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు గుంటుక ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘ కార్యవర్గ సభ్యులు, యువజన విభాగం ప్రతినిధులు, కుల పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో గత ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వినాయక నవరాత్రి, దుర్గానవరాత్రి ఉత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు, ఇతర సాంప్రదాయ వేడుకలకు సంబంధించిన ఆదాయ–వ్యయ వివరాలను సభ్యుల ముందు పారదర్శకంగా సమర్పించారు. సంఘ అభివృద్ధికి సభ్యుల సహకారం ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు.
అనంతరం రానున్న రోజుల్లో చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలు, సంఘ అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ, యువత భాగస్వామ్యాన్ని మరింత పెంచడం, అనుభవజ్ఞులను సలహాకారులుగా చేర్చుకోవడం, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు గుంటుక ప్రసాద్, ఆలయ అధ్యక్షుడు జిల్లా ధనంజయ్, యూత్ అధ్యక్షుడు జక్కుల ప్రవీణ్, పోపా (పద్మశాలి ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్) ప్రతినిధి అందే శివప్రసాద్, సంఘ కార్యవర్గ సభ్యులు, కుల పెద్దలు, యువత తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్
