23.3 C
Hyderabad
Saturday, August 1, 2026
No menu items!

కోరుట్లలో ఘనంగా పంచాంగ శ్రవణం

(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా, కోరుట్ల)

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ దేవాలయం, పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో “శ్రీ పరాభవ” నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని పద్మశాలి కళ్యాణ భవనంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పండితుడు శ్రీ ఉద్దంటి శ్రీధర్ సిద్ధాంతి పంచాంగ శ్రవణం నిర్వహించి, నూతన సంవత్సర ఫలితాలను వివరిస్తూ భవిష్యత్తు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమానికి పద్మశాలి బాంధవులు, సంఘ సభ్యులు, పట్టణ ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు హాజరై, తమ జాతకాలపై వివరణలు తెలుసుకున్నారు. అనంతరం పాల్గొన్న వారికి ఉగాది పచ్చడి, బూరెలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుంటుక ప్రసాద్, ఆలయ కమిటీ చైర్మన్ జిల్లా ధనంజయ్, పద్మశాలి జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ తదితరులు, సంఘం మరియు ఆలయ కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles