36.2 C
Hyderabad
Tuesday, April 21, 2026
No menu items!

అక్రమాలను ఎదుర్కోవడానికి వస్తే అరెస్టులా? బిజెపి అంటే భోగభాగ్యాల పార్టీ యా?

(తెలంగాణ సామ్నా డెస్క్)

అక్రమాలను ఎదుర్కోవడానికి వస్తే అరెస్టులా? బిజెపి అంటే భోగభాగ్యాల పార్టీ యా?

పార్టీ అంటే సిద్ధాంతం అనుకున్నారా? లేక మీ స్వార్థానికి వాడుకునే వ్యాపారం అనుకున్నారా? అంటూ కొందరు బిజెపి కార్యకర్తలు జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం నిరసన తెలియజేశారు. ధర్మపురి అరవింద్, భోగా శ్రావణి తీరు చూస్తుంటే, బీజేపీ అంటే “భోగభాగ్యాల” పార్టీగా మార్చేసినట్టు కనిపిస్తోంది అని వారు విమర్శించారు. ఇది పార్టీ మీటింగా? లేక వాటాల పంచాయితీనా? అని అరిచారు.

పార్టీకి సంబంధించిన సమావేశం పార్టీ కార్యాలయంలో జరగాలి కానీ, ఇంట్లో పెట్టుకోవడమేంటి? అని ఆ కార్యకర్తలు విమర్శించారు.అది పార్టీ మీటింగ్ కాదు, మున్సిపల్ ఎన్నికల పేరుతో వెనకేసిన సొమ్మును, కార్యకర్తల కష్టాన్ని పంచుకోవడానికి పెట్టుకున్న దొంగల ముఠా సమావేశం అని గొడవకు దిగారు.

అమ్మడపోయిన నేతలు: పార్టీలు మారుతూ, తమను తాము అమ్ముకునే సంస్కృతి ఉన్నవారి చేతిలో పార్టీని పెట్టడం వల్ల పార్టీ పరువు బజారున పడిందని వారు వాపోయారు.

రక్తం ధారపోసి పని చేసిన, చేస్తున్న కార్యకర్తలకు ఈ పార్టీలో స్థానం లేని పరిస్థితి ఏర్పడిందని వారు ఆందోళన చేశారు. కేవలం దోపిడీదారులకు, మోసగాళ్లకే పెద్దపీట వేస్తున్నారు అని వారు విమర్శించారు.
ఆందోళనలో పాల్గొన్న చీపెల్లి రవీందర్, సుధాకర్ తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జగిత్యాల జిల్లా బీజేపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గా మారిపోయిందని, ఇకనైనా రాష్ట్ర కేంద్ర నాయకత్వం జగిత్యాల జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆందోళన చేసిన వారు తెలిపారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles