(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్ 7వ వార్డు సంయుక్త్ వెల్ఫేర్ అసోసియేషన్ యూత్ సభ్యులు హనుమాన్ దీక్ష స్వాములకు సేవా కార్యక్రమం నిర్వహించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రానికి వివిధ ప్రాంతాల నుండి పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పండ్లు, మజ్జిగ, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు.
ఆదర్శనగర్ కాలనీలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో కాలనీ గౌరవ అధ్యక్షులు బురుగు రామస్వామి గౌడ్, పడాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే స్కంద వినోద్, ఆరేటి రాజేందర్, బిట్ల భాస్కర్, ఉషశకోల రాములు, గండ్ర మహిధర్, శనిగారపు భీమరాజు పటేల్, దీపక్, శ్రావణ్, శశి కుమార్, రిశ్వంత్, రాజేష్, వరుణ్, కౌశిక్ రెడ్డి, శివాకాష్, సతీష్ చంద్రశేఖర్, ప్రణయ్, కౌశల్, నవీన్, రాజస్వామి, సుమంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.
