31.2 C
Hyderabad
Wednesday, April 22, 2026
No menu items!

శ్రీ ఆది శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యుల జయంతి వేడుకలు

(బాలే అజయ్ – 9290277727)

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ ఆది శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యుల జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు సాధన కమిటీ మరియు గ్లోబల్ హైట్స్ ఈ-టెక్నో స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ వేడుకల్లో ఆలయ అర్చకులు పాలేపు రాజేశ్వర శర్మ, బీర్నంది బాను శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వొద్దిపర్తి సంతోష్ ఆచార్యులు, బట్టు హరికృష్ణ హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆది శంకరాచార్యులు సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించిన మహాయోగి అని పేర్కొన్నారు. ఆయన ప్రచారం చేసిన అద్వైత వేదాంత తత్వం హిందూ సంప్రదాయాలకు మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు. దేశంలోని నాలుగు దిక్కుల్లో పీఠాలను స్థాపించి ధర్మ పరిరక్షణకు ఆయన చేసిన సేవలు అమోఘమని కొనియాడారు.
కార్యక్రమంలో మంచాల జగన్, పడిగెల శ్రీనివాస్, తుమ్మనపల్లి మహేష్, శ్రీపతి నాగభూషణ్, కొండవండబతిని అమర్నాథ్, గట్ల ప్రకాష్, కట్టెకోల లక్ష్మీనారాయణతో పాటు పట్టణ ప్రముఖులు, వివిధ హిందూ సంఘాల నాయకులు, సనాతన ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles