28.3 C
Hyderabad
Saturday, August 1, 2026
No menu items!

వాంగ్మూలం (నాథూరాం గొడ్సే)

(నిన్నటి తరువాయి)

నేరారోపణ

నిందితుందరు న్యాయవాదులను నియమించుకొనినారు. అయినప్పటికి నేరారోపణలకు మాత్రము నిందితులు స్వయముగా ప్రతి వచనమును ఇవ్వవలసియున్నది. అదే విధముగా వారు చేసినారు.ఆ విధముగా చేసేముందు ప్రతి ఒక్కరు వ్రాత మూలక అభిప్రాయ ప్రకటనలను కూడపా సమర్పించుకొనినారు.
తన వ్రాతమూలకమైన ప్రకటనయందు, నాధూరాం, ముఖ్యముగ రెండవ భాగములో నుండి, గాంధీని చంపుటకు తాను నిర్ణయించుకొనుటకు గల కారణములను వివరించినాడు. నేరారోపకులకు ఈ విషయము ముందుగానే తెలిసినది. ప్రకటనను చదువులపూ వారు తమ అక్షేపణను తెలుపగా, న్యాయాధిపతి ఆ ఆక్షేపణను త్రోసిపుచ్చినాడు.
వాంగ్మూలము పూర్తిగా చదువబడినది. మరునాడు పత్రికలు అందులో కొన్ని భాగములను ప్రచురించినవి.
కాని ప్రభుత్వము ఇది చూస్తూ వూరకుండ లేకపోయింది. అది న్యాయనిర్ణయశాఖ ఔన్నత్యమునకు తలవంచదలచలేదు. తల అధఙకార బంధ హస్తములతో ప్రకటనను తిరిగి రూపొందించుటకు పూర్తిగా గాని భాగములుగా గా ప్రచురించుటను ప్రభుత్వము నిషేధించనది.
ప్రభుత్వమునకు ఇట్లుప చేయటలో గల ఉద్ధేశ్యము తేటతెల్లముగనే యున్నది. నాథూరామ్‌ గొడ్సె చిత్రించిన విధముగా గాంధీని ప్రజల దృష్టికి ప్రదర్శించడం వారికి ఇష్టంలేదు. ప్రభుత్వము తనకు ఇంపైనా ఆలోపచనా ధోరణిలో మహాత్మా స్మృతికి తగిన గౌరవ సూచకముగ హంతకులపై ప్రజలలో కల దురభిప్రాయములను కొనసాగనీయవలెనని, సత్యమును అణగద్రొక్కవలెననీ వాంచించినది.
ప్రభుత్వ చర్య ప్రతిఘటన లేకుండా వుండిపోయినందున, వాంగ్మూలముపై నిషేధము తుదకు ఆ చట్టమే రద్దు ఆగునంతవరకు కొన్ని సంవత్సరముల పాటు కొనసాగినది. మూడు దశాబ్దములు గడచిన తర్వాత ఈ ప్రకటన ప్రజలకు చేరుకున్నది.
నాథూరాం తనకేసును తానే వాదించ కోరినాడు. ఆయన తనపై హత్యానేరారోపణ నిరూపణను మాత్రము వ్యతిరేకించకుండా, రెండు రోజులు వాదించినడు. న్యాయస్థానములోప జరుగుచున్న దానిని జరిగినది జరిగినట్టుగా ప్రచురించుటకు పత్రికలకు స్వాతంత్య్రము లేకుండా పోయినది.
(రేపు న్యాయాధిపతి తీర్పు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles