(బాలే అజయ్ కోరుట్ల)
కోరుట్ల మెట్పల్లి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న చిన్న అడవి ప్రాంతంలో నిప్పు రాజుకుంది.
దీనితో దాదాపు రెండు ఎకరాల స్థలంలో ఉన్న చిత్తడికి మంటలు వ్యాపించాయి. చెట్లకు కూడా మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్న వ్యాపారస్తులు భయాందోళనకు గురయ్యారు. మెట్పల్లి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకపోయినా వేసవికాలంలో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో సమీపంలో విద్యుత్ సబ్స్టేషన్ ఉండడంతో భయాందోళన వాతావరణం కనిపించింది.

