నేటి నుంచి 17 రోజులపాటు ప్రపంచమంతా ఆటల పండగ సాగనుంది. 26 దేశాలకు చెందిన 10,500 మంది క్రీడాకారులు ప్రపంచాన్ని ఏకం చేసే మహత్తర కార్యాన్ని భుజాన వేసుకొని తమ తమ ప్రతిభను చూపెట్టడానికి ఉత్సాహం చూపుతున్నారు. పారిస్ వేదికగా ఈ మహత్తర క్రీడా యజ్ఞం ఈరోజు ప్రారంభం కాబోతుంది. భారత్ నుండి నూట 12 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా అందులో తెలుగు వారు ఎనిమిది మంది కావడం విశేషం.
