28 C
Hyderabad
Friday, July 31, 2026
No menu items!

నాథూరాం గోడ్సే వాంగ్ములం

(నిన్నటి తరువాయి)

  1. 1948 జనవరి 15 తేది దాదరులో హిందూ మహాసభ ఆఫీసు వద్ద చూచిన తర్వాత , బాడ్గెని మరల 1948 జనవరి 17వ తేది ఉదయం చూచినాను.
  2. మేము అతనితో కలసి దీక్షిత్‌ మహారాజÊ వద్దకు పోయినట్లు దీక్షిత్‌ మహారాజ్‌ను చూచినట్టున్న గాంధీజీ, పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రు సుహ్రవర్టీలను అంతము చేయు పనిని సావర్కరు ఆప్టేకు నాకు ఒప్ప జెప్పినట్లు ఆప్టేకు చెప్పినట్లున్ను బాడ్గె ఇచ్చిన వాంగ్ములం పూర్తిగా కల్పితము. అతని స్వబుద్ధి జన్యముచ ఆప్టేగాని, నేను గాని ఇటువంటిదేదీ బాడ్గెకి గాని మరెవరికి గాని చెప్పియుండలేదు.
    నా చర్యలలో నేను వీరసావర్కరుచే ప్రబోధము చేయబడినాననియు వ ఆరి ప్రోత్సాహ సహకారములు లేనిచో నేను ఏ విధముగా కార్యక్రమము నిర్వహించినానో ఆ విధముగా నిర్వహించి యుండలేననియు నేరారోపకులు చేయు అసత్యమైన వాదనను నేను నిర్ద్వంద్వముగ తిరస్కరించుచున్నాను. ఈ అసత్యపూరితమైన, అన్యాయమైన ఆర్పోణకు నేరారోపణకు నా తీవ్రమైన అభ్యంతరమును తెలుపుటయేగాక, దానిని నా మేధాశక్తిని, నా న్యాయా న్యాయ నిర్ణయశక్తిని అవమానించుటగా భావించుచున్నాను. నేను ఎవరో మరియొకరి చేతిలో కీలుబొమ్మనో లేక పరికరమునో అని నమ్మించుటకు నేరారోపకులు చేయుచున్న ప్రయత్నము సత్యదూరమై నింద మాత్రమే. నిజానికి అది సత్యదూదరదమైన నిందమాత్రమే. నిజానికి అది సత్యమునకు విపర్యస్తముగా నున్నది.
  3. నా తమ్ముడు గోపాల్‌గోడ్సె ఒక రివాల్వరును సంపాదించు ప్రయత్నము చేయుటకు అంగీకరించినందున అతనిని కూడా మాతోబాటు డిల్లీకి తీసుకొనిపోవుటకుగా, ముందు బొంబాయికి తీసుకొని వచ్చుటకు నేను పూటెకు పోదలచినట్లు చెప్పే బాడ్గె ఇచ్చిన వాంజ్ఞులము కూడా అసత్యమైనది. 1948 జనవరి 15వ తేదిని అతనిని కలసుకొనినప్పుడు పైన 17వ పేరాలో చెప్పిన దానికి మించి బాడ్గెతో నేను ఏమీ మాట్లాడి యుండలేదు. అంతేకాదు. తాను 1948 జనవరి 16వ తేదీనాడు నన్ను పూనాలో జరిపిని సంభాషణ బాడ్గె తన సాక్ష్యములో నివేదించిన దంతయు నిజమ కాదు. పూర్తి అబద్దము. 1948 జనవరి 16వ తేదీన పూనాలో వుండి యుండలేదు. దీని వలన నేను పూనాలో అతనికి ఒక పిస్టలు ఇచ్చి దానికి బదులుగా ఒక పెద్ద రివాల్వరును సంపాదించమని చెప్పినానుట నిజము కాదని స్పష్టమగుచున్నది.
    (తరువాయి రేపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles