(నిన్నటి తరువాయి)
తాను నిరాహారదీక్షను విరమించుటకు గాంధీజీ విధించిన ఏడు నిబంధనలలో ఒకటి డిల్లీలో హిందూ శరణార్థులు ఆక్రమించుకొనియున్న మశీదులకు సంబంధించినది. డిల్లీలో శరణార్థులు ఆక్రవమిచుకొనియున్న మశీదులనన్నిటినీ, ఖాళీచేసి లేక ఖాళీ చేయించి ముస్లింలకు ఒప్పజెప్పవలెననేది ఈ నిబంధన ఉద్ధేశ్యము. తన నిరాహారదీక్ష ద్వారా ఒప్పించినాడు. ఆ దినము నేను డిల్లీలో వుండటం సంభవించినది. ఈ నిబంధనను పూర్తిగా అమలు చేయటంలో జరిగిన సంఘటనలను స్వయముగా చూచినాను. అవి, నీరు గడ్డకట్టే చలిదినాలు. గాంధీజీ నిరాహారదీక్షఫ విరమించిన రోజున కూడా వర్షము వుండినది. ఈ వాతావరణ పరిస్థితులు, సూదులు గుచ్చినట్లు వుండే చలివలన మంచి రక్షిత పరిస్థితులలో వుండేవారు కూడా వణికే రోజులు. ఆశ్రయం కోసం డిల్లీ వచ్చిన శరణార్థుల కుటుంబములు ఒకటి తర్వాత ఒకటి బయటికి తరుమబడ్డవి.
అట్లా చేసేటప్పుడు వారు తలదాచుకొనే దానికి, నిలకడగా ఉండను ప్రత్యామ్నాయముగా ఏర్పాట్లు ఏమీ చేయలేదు. ఒకటి రెండు కుటుంబములు పిల్లలు స్త్రీలతోసహా, ఉన్న చాప చుట్ట నెత్తిన బెట్టుకొని, ‘‘గాంధీజీ! మాకు తలదాచుకొవడానికి ఇంత చోటు చూపించు’’ అని ఆక్రవందిస్తూ బిర్లా భవనము వద్దకు కూడ వచ్చినారు. రాజమహలు వంటి బిర్లా భవనములో నివసించే గాంధీజీ చెవులకు ఈ దయనీయమైన హిందువుల ఆర్తనాదములు వినిపించడం ఎప్పుడైనా సాధ్యమయ్యేనా! కఠిన హృదయుడి హృదయాన్ని కూడ కరిగించగల ఈ సన్నివేశాన్ని నేను కండ్లారా చూచినాను. దీనిలో కొన్ని లోతైన ఆలోచనలు నా మనస్సును తొలచివేయసాగినవి. ఈ శరణార్థులు తాము గెంటివేయబడిన తమ సొంత ఇండ్లకన్న ఈ మశీదులు మేలుగా తలచినారంటే, అదేమి తమాషా కోసము చేసినారా? ఈ శరణార్థులు మశీదులను అక్రమించుకొనుటకు ప్రొద్బలము చేసి కారణములు, పరిస్థితులు గాంధీజీకి తెలియవా?
పాకిస్తాన్‌గా మారిపోయి ఈ దేశ భూభాగములో ఒక్క దేవాలయము, ఒక్క గురాద్వారము గూడా లేకుండా నిర్మూలింపబడినవి. శిఖులను హిందువులను అవమానించాలి అనే ఒకే ఒక ఉద్దేశ్యముతో తమ దేవాలయములు, గురుద్వారములు, రోతకలిగించే పనులకు వుపయోగించి అపవిత్రం చేయబడడం ఈ శరణార్థులు తమ కండ్లారా చూచినారు. శరణార్థులు తమ సర్వస్మము వదలవలసిన పరిస్థితులలో ఇక్కడికి వచ్చినారు. డిల్లీకి పరుగెత్తినారు. డిల్లీలో తలదాచుకొనుటకు ప్రదేశము కనబడలేదు. రోడ్ల అంచులలోనో, చెట్ల క్రిందనో, ఎదో ఒక విధముగ తల దాచుకొనవలసి వచ్చిప్పుడు ఈ శరణార్థులు పంజాబులో వాయవ్య సరిహద్దు ప్రాంతములో తమ ఇండ్లు వాకిళ్లను గూర్చి పదేపదే తమ మనస్సులలో తలపోసుకొనినారనిన ఆశ్చర్యమేమున్నది? ఇటువంటి పరిస్థితులలోనే, శరణార్థులు మసీదుల ఆక్రమణకు పూనుకొనినారు. వారు మశీదుల కప్పు కింద నివసించసాగినారు. ఆ విధంగా చేయడంలో మశీదులు మానవ శ్రేయస్పుస కొరకే వుపయోగింపబడలేదా? గాంధీజీ, వారు ఆక్రమించిన మశీదుల నుండి తొలగించుటకు ముందుగా వారికి ఆశ్రయమిచ్చుటకు ప్రత్యామ్నాయమైన వసతులను ఏర్పాటు చేయవలసినదిగా ప్రభుత్వమును, అందుకు సంబంధించిన వారిని కోరివుండి వేంటే ఆయన కొర్కెలో కొంత మానవత్వ స్పర్శ అయినా కనిపించి వుండేది.
(మిగితా రేపు)
