
తెలంగాణ సామ్నా బ్యూరో: ఓ కుటుంబంలో నలుగురు సభ్యులు వున్నారు అనుకొండి. కాని వారు తినడానికి మూడే ఆపిల్స్ వుంటే, ఆపిల్ అంటే నాకు యిష్టం లేదు అనే మొదటి వ్యక్తి ఎవరో ఎవరైనా ఊహించవచ్చు. ఆమె తల్లి. అనురాగాలకు, ఆత్మీయతలకు నెలవై నడిచే దేవతే అమ్మ. అమ్మమీద ఎన్ని కథలు చెప్పినా, కావ్యాలు చెప్పినా తక్కువే అనడం అతిశయోక్తి కాదు. అలాంటి తల్లి తన ముగ్గురు సంతానానికి విషమిచ్చి చంపేసింది అనే విషయం సంచలనం కాకుండా ఎమవుతుంది?
ఇలాంటి ఓ రాక్షస తల్లి చేసిన అమానవీయ హత్యలు చేసిన విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగింది. తన సంతానాన్ని చంపేసింది అంటే ఏదో కుటుంబ కలహలు లేదా ఆర్థిక పరిస్థితులు బాగాలేకనో, లేదా పిల్లలను పోషించే ఆర్థిక శక్తి లేకనో కాదు. కామం పోరలు సభ్యసమాజం కనిపించనంతగా కళ్లను కప్పేసిన నేపథ్యంలో తన పిల్లలు తన అనైతిక పనులకు అడ్డు వస్తున్నారనే అనే కారణంతో ఆ తల్లి తన పిల్లలకు విషం ఇచ్చి చంపేసింది. ప్రియుడి కోసమే తన పిల్లలకు విషమిచ్చి చంపేసిందని పోలీసుల విచారణలో తేలింది అనే విషయం తెలిసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న చెన్నయ్య, రజిత దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. భర్తతో పాటుగా భార్య లావణ్య కూడా ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుంది. ఇంతవరకు అంతా బాగానే వున్నా కొద్దిరోజుల క్రితం లావణ్య పదవ తరగతి బ్యాచ్ వారి గెట్ టు గెదర్ జరిగింది. ఇదే చెన్నయ్య కుటుంబంలో చిచ్చు పెట్టినట్టయ్యింది. ఆ కార్యక్రమంలో రజితకు బచ్‌పన్‌కా దోస్త్ ఒకడు కలిశాడు. ఆ సందర్భంగా వారిద్ధరి మాటలు కలిశాయి. పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినట్లు వున్నాయి. మొబైల్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నట్లు వున్నారు. కనెక్షన్ తొందరగానే కలిసింది. వారిద్ధరి అనైతిక బంధం బలపడిరది. దీనితో రజిత భర్త పిల్లల్ని చంపేసి ప్రియునితో వుండిపోవాలని పథకం వేసుకుంది. కుటుంబం అంటే భర్త పిల్లలు, అంట్లు తోమడం, అన్నం వండడం లాంటి ఎలాంటి ఇబ్బందులు వుండని సరికొత్త ప్రేమలోకంకు వెళ్లిపోవాలని అనుకుందో ఏమో? గీసుకున్న స్కెచ్ ప్రకారం మార్చి 27 రాత్రి భోజనంలో పెరుగులో విషం కలిపింది. ఇదేమీ తెలియని పిల్లలు పప్పు, పెరుగుతో హాయిగా అమ్మచేతి వంట తిని పడుకున్నారు. చెన్నయ్య మటుకు పెరుగుతో కాకుండా ఒక పప్పుతోనే భోజనం ముగించి పనికోసం వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి 11 గంటలకు వచ్చి చూసేసరికి తన ముగ్గురు పిల్లలు శవాలై పడివున్నారు. రజిత మటుకు కడుపు నొప్పి అంటూ విలవిలలాడిరది. లావణ్యను వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలెట్టారు. తీగలాగితే డొంకంతా కదిలింది. రజిత చేసిన ఘోరమైన పని తాలుకూ కహానీ అంతా బట్టబయలైంది.
ప్రియుని మోజులో పడి ముక్కపచ్చలారని ముగ్గురు సంతానాన్ని కర్కషంగా చంపుకున్న రజితను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బంగారంలాంటి ముగ్గురు పిల్లల్ని చూస్తూ నీళ్లు తాగి బతికేయొచ్చు అన్నంత ముద్దుగా వున్నారు సాయికృష్ణ (12) మధుప్రియ(10) గౌతమ్(8) అనే వారి సంతానం.
