జగిత్యాల జిల్లా మెట్టుపల్లి సర్కిల్లోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గల బండలింగాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన ఓ వ్యవసాయ భూమిలో గుర్తుతెలియని యువకుని మృతదేహం లభ్యమైనట్టు ఎస్సై అనిల్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 30 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని ఆయన తెలిపారు. బూడిద కలర్ టీ షర్టు నలుపు రంగు జీన్స్ బ్రౌన్ కలర్ బెల్ట్ బ్లూ కలర్ డ్రాయర్ ధరించి ఉన్నారని ఆయన తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
