రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. చార్జీల పెంపుతో కుటీర పరిశ్రమలు చిన్న పరిశ్రమలపై భారం పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. అన్ని రకాల పరిశ్రమలను కాపాడుకోకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. అన్ని సంస్థలను ఒకే కేటగిరిగా మార్చాలన్న ప్రతిపాదన సరైంది కాదని ఆయన విమర్శించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు ఎప్పుడు ఇస్తారు ఎక్కడ ఇచ్చారు అసలు ఇస్తారా ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు.
