27.3 C
Hyderabad
Friday, June 5, 2026
No menu items!

వాంగ్మూలం (నాథూరామ్‌ గోడ్సే)

నేరారోపకులు149 మంది సాక్షులను ప్రవేశపెట్టినారు. విచారణ 1948 డిసెంబర్‌ 30వ తేదీకి పూర్తికాగా తీర్పు ఇచ్చుట వాయిదా వేయబడి, 1949 ఫిబ్రవరి 10వ తీదీన ఇవ్వబడనది.
వీరసావర్కర్‌ నిర్దోషిగా నిర్ణయింపబడినారు.
తనతోడి నిందితులకు వ్యతిరేకముగ సాక్ష్యము ఇచ్చినందుకుగా దిగంబరబాడ్గేకె క్షమాభిక్ష పెట్టి విడుదల చేసినారు.
విష్ణుకర్కారే, మదన్‌లాపహ్వ, గోపాల్‌గొడ్సే, శంకర కిష్ఠయ్య డాక్టరు పర్చూరేలు ఇతర ఙక్షలతో పాటు యావజ్జీవ దిద్వీపాంతర వాసశిక్ష అనుభవించవలసినదిగా ఆ తీర్పు నిర్ణయించినది.
నాథూరామ్‌గొడ్సే, నారాయణ ఆప్టేలు ఉరి తీయబడవలసినదిగా శిక్ష విధింపబడినది.

శక్షలు ప్రకటించిన వెంటనే పూర్తిగా నిండియుండిన న్యాయస్థానపు గది ‘‘ఆఖండ భారత్‌ అమర్‌ రహే’’ ‘‘వందేమాతరం’’ ‘‘స్వాతంత్య్ర లక్ష్మీకి జై’’ అని శిక్షలు పొందినవారు అప్రయత్నంగా అతి సహజముగా చేసిన మేఘగర్జనల వంటి నినాదాలతో ప్రతిధ్వనించి పోయినది.
ప్రత్యేక చట్టము యొక్క లక్షణము
గాంధీ ప్రజాస్వామ్య పద్ధతికి కట్టుబడిన ప్రభుత్వములో ఉన్నతమైన స్థానాన్ని ప్రాబల్యాన్ని అనుభవిస్తూ వుండినాడు. ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయుటకు ముందుగనే బొంబాయి ప్రజాసంక్షేమ చర్యల చట్టము (బాంబే పబ్లిక్‌ సెక్యూరిటీ మెజర్స్‌ ఆక్ట్‌) అనే ప్రత్యేక చట్టాన్ని డిల్లీ ప్రాంతానికి కూడా అన్వయించుచున్నట్లు చేసినారు. ఈ చట్టము ఈ విచారణ తేదికి ముందుకాలము నుండే అమలు లోనికి వచ్చునట్లు చేయబడినది.
న్యాయశాస్త్ర దృష్టిలో పౌరులందరు సమానులే అనే ప్రాథమిక సూత్రము మరియు ఇతర ప్రాథమిక హక్కులు కూడా పీ చట్టము వల్ల ప్రజలకు లేకుండా చేయడినవి. అప్పటికి సుప్రీము కోర్టు ఏర్పరచబడియుండలేదు. కొంతకాలము తర్వాత ఆ న్యాయస్థానము ఈ చట్టము రాజ్యాంగ విరుద్ధమైనదిగా నిర్ణయించినది. కాని ఈ చట్టము రాజ్యాంగ విరుద్ధమైనదిగా ఇవ్వబడిన నిర్ణయమును ఆ తీన్పుకు ముందు కాలమునకు వర్తించునట్లు చేయనందున, శిక్షలు పొందినవారు, ఆ తీర్పు వలన లాభము పొందలేక పోయినారు.
సాధారణ చట్టములోవలె, ఈ ప్రత్యేక చట్టము ప్రకారము మరణశక్ష విధింపబడినవారి శిక్షను హైకోర్టు ధృవపరవలసిన అవసరము లేదు. ఆప్పీళ్లు చేసుకొనుటకు ఇవ్వబడిన గడువు పదిహేను రోజులు మాత్రమే. సాధారణమైన కేసులలో ఈ గడువు ఆరవై లేక తొంబై రోజులు
(మిగితా రేపు… ఆపీళ్లు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles