పాలన చేతకాక కేంద్రాన్ని రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నాడని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తానని ఎన్నికల ముందు చెప్పి ఇప్పటివరకు కూడా హామీలను అమలు చేయని కేసీఆర్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఎప్పుడూ కూడా హామీలు ఇచ్చి వెనుకడుగు వేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి ముందు చేయాలని ఆయన అన్నారు. కెసిఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నాడని ఆయన అన్నారు.
