నీతి ఆయోగును బహిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడం అతని విజ్ఞతకే వదిలివేసే అంశమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రాన్ని విమర్శించడం కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టారని ఆయన విమర్శించారు. తెలంగాణను అభివృద్ధి చేయడం వల్లే ప్రజలు తమకు 35 శాతం వరకు ఓట్లు వేశారని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా ప్రజలు బడ్జెట్ను సమర్థిస్తుంటే తెలంగాణలోని కేటీఆర్ రేవంత్ రెడ్డి విమర్శించడం ఎంతవరకు సమంజసం అని ఆయన అన్నారు.
