నిన్నటి తరువాయి
నా మనస్సులో ఇట్టి ఆలోచనలతో, శరణార్థుల శిబిర ములలో తిరుగాడుచుండగా తన వీపుపై కెమెరాను తగిలించుకొనియున ఒక ఫోటో గ్రాఫరును కలుసుకొనినాను. ఫోటో తీసుకొనవవలసినదిగా నన్ను అతను కోరినాడు. అతు ఒక శరణార్థిగా నాకు అనిపించినాడు. నేను ఒప్పుకొని ఫోటో తీయించుకొనినాను. నేను రైల్వేస్టేషనుకు తిరిగి వచ్చిన తరువాత నా మానసిక స్థితిని రేఖామాత్రముగా తెలియజేయుచు, నానారావు ఆప్టే నా మాద్రణాలయ వ్యాపారములో చాలా సన్నిహతుడైన భాగస్వామి కావున అతనికి విషయము తెలియ జేయుట నా బాధ్యతగా నేను భావించినాను. అందులో ఒక లేఖను పూనాలో ఆయన ఇంటి విలాసమునకు, రెండవ దానిని హిందూ రాష్ట్ర కార్యాలయమునకు పంపినాను.
ఇంకొక విషయము కూడ ఇక్కడా చెప్పదలిచినాను. నేను చేసి ఈ ప్రకటనలన్ని పూర్తిగా నిజమైనవి, సరినవి. అందులో ప్రతి ఒక్కటి ప్రామాణికముగా చూడదగిన గ్రంథములను చూచి పేర్కొనబడినవి.
హిందూస్తాన్ అను పేరుతో ప్రసిద్ధమైన ఈ దేశము మరల సమైక్యమగు గాక. దురాక్రమణ చేయువానికి లొంగిపోవటకు దారితీయు, పరాజ శంకిత మనస్తత్వము వదలించుకొనటను ప్రజలకు నేర్పుదురు గాక. సర్వశక్తిమంతునికి ఇదియే నా చరమ వాంచ ` ప్రార్థన.
ఇక ఇపుఏ్పడు నా వాదమును పూర్తి పచేసినాను. నేను కూర్చోనుటకు ముందు, ఓర్పుతో వినినందుకు చూపిన ఆదరణకు, కలుగజేసిన సౌకర్యములకు గౌరవనీయులైన తమకు మనస్పూర్తిగా గౌరవపూర్వకమైన కృతజ్ఞత తెలుపుచున్నాను. అదే విధముగ నా న్యాయశాస్త్ర ఉపదేశకులు, న్యాయవాదులకు నాకు సహాయమందజేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను. ఈ కేసుతో సంబంధమున్న పోలీసు అధికారులపై నాకు ఏలాటి దురభిప్రాయము లేదు. వారు చూపిన దయ, ఆదరణలకు వారికి మనస్పూర్తిగ అభినందములు అందజేయుచున్నాను. అదే విధముగ వారు కలిగించిన సౌకర్యములకు కారాగార అధికారులకు కూడ నా కృతజ్ఞతాభివందనములు తెలుపుచున్నాను.
300`400 మంది వరకు గల జనసమూహ సమక్షములో పట్టపగలు గాంధీజీపై నేను తుపాకికాల్పులు జరిపినానుట నిజము. నేను పరుగెత్తిపోవుటకు ఏలాంటి ప్రయత్నము చేయలేదు. అసలు పరుగెత్తిపోవలెననే అభిప్రాయమును నేను ఎప్పుడూ నా మనసులో కలిగి యండలేదు. నన్ను నేను తుపాకీతో కాల్చుకొనుటకు కూడా ప్రయత్నము చేయలేదు. నాకు అటువంటి ఉద్దేశము లేదు. ఎందువలెనంటే, ఒక బహిరంగ న్యాయ స్థానములో నా ఆలోచనా సరళిని బహిరంగ పరచుకోవలెననేది నా ప్రగాఢమైన కోరికగా వుండినది.
అన్ని వైపులనుండి వచ్చి విమర్శల వలన కూడా, నా చర్యలోని రుజుత్వముపై నాకు గల విశ్వాసము ఏ మాత్రము సడలలేదు. భవిష్యత్తులో ఒకానొక దినము, సత్యపరాయణులైన చరిత్రకారులు నా చర్యను మదింపు చేసి దానిలోని నిజమైన విలువను గ్రహించగలరనే విపషయములో నెకెలాంటి సందేహమూ లేదు.
‘‘ఆఖండ భారత్ అమర్ రహే’’
‘వందే మాతరమ్’
నాథూరామ్ వి.గోడ్సే
డిల్లీ. 08111948
సమాప్తం
తరువాయి భాగం రేపు
