
(బాలె అజయ్, తెలంగాణ సామ్నా)
కోరుట్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవ వేడుకలను జనవరి 12న కోరుట్ల మరియు మెట్పల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
“దేశానికి నిజమైన సంపద ఖనిజాలు కాదు, యువతే” అంటూ యువత మేలుకో – దేశాన్ని యేలుకో అనే నినాదాలతో జనసైనికులు హోరెత్తించారు. ఈ వేడుకలకు ముందురోజు కోరుట్ల పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహానికి రంగులు వేసి, పరిసరాలను శుభ్రపరిచి, కార్యక్రమ వేదికను జనసైనికులు స్వయంగా సిద్ధం చేయడం విశేషం.
ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ, స్వామి వివేకానందుడి ప్రధాన నినాదం “లేవండి మేల్కొనండి, లక్ష్యం చేరవరకు ఆగకండి”, “యువత మేలుకో – దేశాన్ని యేలుకో” అనీ, యువతకు దేశాన్ని మార్చగల శక్తి ఉందని, వారి ఆలోచనలు, సంకల్పం, దేశ ప్రగతికి మూలమని స్వామీజీ గట్టిగా నమ్మే వారిని అన్నారు. స్వామి వివేకానంద ఆశయాలను నేటి కాలంలో ముందుకు తీసుకువెళ్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారని పేర్కొన్నారు. యువతే దేశ నిర్మాణానికి వెన్నెముక అనే బలమైన సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చారని, యువత నవయువ భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ జనసేన పార్టీ పి.ఓ.సి వోడ్నాల రామారావు, యువత విభాగ అడ్హాక్ కమిటీ సభ్యులు సాయికృష్ణ, కరుణాకర్, రంజిత్, సూర్య ప్రకాశ్, విజయ్, శశి, సంజీవ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
