జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన తిరుపతి అన్న యువకుడు సౌదీలో అదృశ్యమైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ కి వెళ్ళిన తిరుపతి అక్కడి ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. గత సంవత్సరం డిసెంబర్ 7వ తారీకు నా కుటుంబ సభ్యులతో మాట్లాడిన తిరుపతి ఆ తర్వాత నుండి కుటుంబ సభ్యులకు ఫోన్లో గాని ఉత్తరాల ద్వారా గాని ఇతర బంధుమిత్రులకు గాని అందుబాటులో లేడని వారు విలపిస్తూ తెలిపారు. తిరుపతి ఆచూకిని ఎలాగైనా తెలుసుకొని తమ కుటుంబ సభ్యులకు అప్పగించాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రోధిస్తూ విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుపతికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.
