(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల అంబేద్కర్ నగర్‌లోని శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో సుమారు 1200 మంది భక్తులు, 200 మంది హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అర్చకులు బ్రహ్మశ్రీ దివాకర్ శర్మ, పూర్ణిమ చౌదరి దంపతుల వైదిక మంత్రోచ్చారణల మధ్య పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు మంచాల జగన్, ప్రధాన కార్యదర్శి బట్టు హరికృష్ణ, కోశాధికారి రేగుంట రాజారాం, చైర్మన్ వనపర్తి చంద్రమోహన్, కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ, గురు స్వామి రాజేశం, నిర్వాహకులు మంచాల రమేష్, పల్లెర్ల మహేందర్, కంఠం సదాశివ్, కట్కం రంజిత్, శ్రీపతి రమేష్, దొంతుల రమేష్, అల్లాడి మహేష్, గాండ్ల ఆంజనేయులు, ఆడెపు నరేష్, పిన్నంశెట్టి జనార్దన్, అడువాల ప్రభాకర్, తుమ్మనపల్లి మహేష్, కొక్కెర మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
