(అల్లే సంతోష్, కథలాపూర్)
బుధవారం కరీంనగర్ ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో మరియు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన దాడిని ఖండిస్తూ కథలాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వేములవాడ నియోజకవర్గ బి ఆర్ ఎస్ ఇన్చార్జి చెల్మెడ లక్ష్మీనరసింహారావు ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల మరియు పార్టీ ఆఫీస్ ల పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఈ ధర్నా నీర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కథలాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన కథలాపూర్ మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు
ఈ కార్యక్రమం లో కథలాపూర్ మండల మాజీ ఎంపిటిసి మామిడిపల్లి రవి,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం భూమా రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్ధినేని నాగేశ్వర్ రావు, మాజీ వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్ రావు, సర్పంచులు రాంమోళ్ల సురేష్,సాంబా నవీన్,మాజీ ఎంపీటీసీ దొప్పాల హైమావతి జలందర్,మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండీ. రఫీ,మిట్టపెల్లి గంగారెడ్డి, మామిడి పెల్లి రాజ రెడ్డి, బాల్క సంజీవ్,జగన్ సంతోష్ రామాంజనేయులు, జీరా అజయ్, కాసారకపు జలందర్, నల్ల గంగారెడ్డి,కోట శంకర్,వంగ మహేందర్, ముంజ దశ గౌడ్ మరియు గ్రామ మండల స్థాయి వివిధ హోదా లో ఉన్న తాజా మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ కార్యకర్తల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

