26.7 C
Hyderabad
Friday, September 18, 2026
No menu items!

ఎర్రకోట

(నిన్నటి తరువాయి)
ఈ కేసు విచారణకై ఒక ప్రత్యేక న్యాయస్థానము ఏర్పరుపబడినది. శ్రీ ఆత్మచరణ్‌ అగ్రవాల్‌, ఐ.సి.యస్‌. న్యాయవాదిగా నియమింపబడినారు. ప్రసిద్ధమైన ఎర్రకోటలో ఈ న్యాయస్థానము ఏర్పాటుచేయబడినది. ఈ స్థలము వీక్షించిన చారిత్రాత్మక విచారణలో ఇది మూడవది. మొదటదిÑ మొగల్‌ పాదుషాలలలోప చరమ పాలకుడు బహదూర్‌షా జాఫర్‌, మరికొందరు నిందితులకు సంబంధించినది, 1857లో స్వాతంత్య్రమునకై బ్రిటిష్‌వారిపై సమరము సాగించిన వారిలో వీరు వున్నారు. రెండవదిÑ 1945లో జరిగినది. రెందడవ ప్రపంచ సంగ్రామ సమయములో నేతాజీ సుభాష్‌ చంద్రబోసు నాయకత్వము వహంచిన భారత జాతీయ సైన్యములోని సైనికాధికారులు బ్రిటిష్‌ పాలనపై తిరుగుబాటు జరిపినారను నేరారోపణ పచేయబడి వచారణ జరుపబడినది. మూడవదిÑ గాంధీ హత్యకుగా జరిగిన విచారణ.
ఎర్రకోట గోడల మధ్య ఒక దానిలో ఒక వరుస గదులు నిందితులకు కారాగారముగ మార్చబడినవి.
పన్నెండు మంది వ్యక్తుల వివిధ నేరారపణలతో నేరస్థులుగా చేయబడినారు. అందులో ముగ్గురు అజ్ఞాతముగా వుండిపపోయినారు. శ్రీఆత్మచరణ్‌ ముదు 1948 మే 27వ తేదీన, ఆ తర్వాత హాజరుపరుచబడిన మితిలా తొమ్మిది మంది, 1. నాథూరామ్‌ గాడ్సే, వయసు 37, పూణే, 2. నారాయణ దత్తాద్రేయ ఆప్టే,34, పూణే, విష్ణురామకృష్ణ కార్కరే, 37, అహ్మద్‌నగర్‌, 4. మదన్‌లాల్‌ కె.పహనా, 20, బొంబాయి, 5. శంకర కిష్ఠయ్య, 20, సోలాపూర్‌, గోపాల్‌ వినాయక గోడ్సే, 27, పూణే, దిగంబర్‌ రామచంద్ర బాడ్గె, 40, పూణే, వినాయక దామోదర సావర్కర్‌, 66, బొంబాయి, 9. దత్తాద్రేయ సదాశివ పరమార, 47, గ్వాలియర్‌.
అజ్ఞాతములో వుండిపోయిన ముగ్గురు వ్యక్తులు 1. గంగాధర దండావతే, గంగాధర జాదవ్‌, 3. సూర్యదేవ్‌ శర్మ అందరు గ్వాలియర్‌ వారే.
ఏడవ నిందితుడు దిగంబర బాడ్గే ప్రభుత్వ సాక్షిగా మారినందున, వి.డి. సావర్కరు వరుస క్రమంలో ఏడవ సంఖ్య పొందినారు. విప్లవ వీర సావర్కర్‌ తీవ్రమైన విప్లవకారుడుగా సావర్కరు నిస్వార్థమైన మహిమాన్వితమైన చరిత్ర కలిగియున్నాడు. వారిని గూర్చి పొందుపరచనిదే భారతదేశ చరిత్ర సమగ్రము కానేకాదు. బాలుడుగానే స్వాతంత్య్ర ఉద్యమంలో ముందుకు దూకినవాడు. ‘‘స్వాతంత్య్రము స్థాపించుట ఒక పవిత్రమైన విద్యుక్త ధర్మము’’అనునది వారి ఆదర్శము. ‘‘భారతదేశముపై బ్రిటిష్‌ పాలన ఒక అసహజమైన సమర్థించుటకువీలులేని గుదిబండ. ఏ పద్దతిలోనైనా సరే దానిని భారతదేశపు మెడపై నుండి తొలగించుట సమర్ధనీయమే.’’ అని వారు చెప్పేవారు. ఇటలీ స్వాతంత్య్ర ఉద్యమ వీరుడు జోసెఫ్‌ మాజ్జీనీ తత్త్వముతో భారత యువకుల భావములను ప్రజ్వలింపజేసాడు సావర్కర్‌. మొట్ట మొదలగా 1857 విప్లవము ఇంగ్లీషువారు వర్ణించినట్లు ఒట్టి సిపాయిల తిరుగుబాటు కాదు, అది ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామము అని ప్రతిపాదించిన చరిత్ర పరిశోధకుడు సావర్కరు.
(తరువాయి 4.01.2025)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles